నెత్తురోడిన రోడ్డు.. 13 మంది వలస కూలీలు మృతి - MicTv.in - Telugu News
mictv telugu

నెత్తురోడిన రోడ్డు.. 13 మంది వలస కూలీలు మృతి

May 19, 2020

Truck And Bus Collision Bihar

వలస కూలీలను రోడ్డు ప్రమాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ప్రతి రోజు ఏదో ఒక చోట ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. గత వారం రోజులుగా ఈ పరిణామాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా బిహార్‌, మహారాష్ట్రలో రోడ్లు నెత్తురోడాయి. వలస కూలీలతో వెళ్తున్న లారీ బిహార్‌లోని బగల్‌పూర్‌లో నౌగచియాలో బస్సును ఢీ కొట్టడంతో 9 మంది మరణించారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల ఆర్తనాధాలతో ఆ ప్రాంతం అంతా భయానకంగా మారిపోయింది. వెంటనే సహాయక చర్యలు చేపట్టి గాయపడిన వారిని పోలీసులు ఆస్పత్రులకు తరలించారు.

కాగా, మహారాష్ట్రలోనూ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ తెల్లవారుజామున 3.30 గంటలకు వలస కూలీలతో వెళ్తున్న ప్రమాదానికి గురైంది. వేగంగా వెళ్తున్న బస్సు ముందు వెళ్తున్న ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలతో పాటు బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మరణించారు. 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. సోలాపూర్ నుంచి జార్ఖండ్‌కు తరలిస్తుండగా కొల్వాన్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఈ రెండు ఘటనల్లో అతి వేగం, నియంత్రణ లేకపోవడమే కారణంగా తెలుస్తోంది. కాగా లాక్‌డౌన్ నేపథ్యంలో సొంత ఊళ్లకు వెళ్తున్న కూలీలు ఇలా ప్రమాదాలకు గురి కావడం అందరిని కలిచివేస్తోంది.