ఇదేందయ్యా? లారీకి రూ. 2 లక్షలా 500 జరిమానా - MicTv.in - Telugu News
mictv telugu

ఇదేందయ్యా? లారీకి రూ. 2 లక్షలా 500 జరిమానా

September 12, 2019

కొత్త మోటారు వాహనాల చట్టం వాహనదారులకు పట్టపగలు చుక్కలనే కాకుండా సమస్త గ్రహాలను చూపుతోంది. పోలీసులు కొత్త నిబంధనల పేరుతో ఎడాపెడా చలాన్లు వాయిస్తున్నారు. ఇటీవల రాజస్తాన్‌లో ఓ లారీ డ్రైవర్ కు ఓవర్ లోడ్ కు గాను రూ. 1.41 లక్షణ జరిమానా వేసిన ఉదంతం ఇంకా కన్నీళ్లు తెప్పిస్తుండగా అంతకు మించిన షాకిచ్చారు ఢిల్లీ పోలీసులు. ఓవర్ లోడుతో వెళ్తున్న ఒక లారీకి ఏకంగా రూ. 2,00,500 జరిమానా వేశారు. ముకర్బా చౌక్ ప్రాంతంలోని పోలీసులు ఇలా చట్టబద్ధంగా చేతివాటం ప్రదర్శించారు. డ్రైవర్ జరిమానా కట్టాడో, లారీని వదిలేసి పోయాడో తెలియదుగాని, చలానా ఫొటో మాత్రం వైరల్ అవుతోంది.