truck rams into a roadside in bihar 12 dead
mictv telugu

ఊరేగింపు కార్యక్రమంలో విషాదం.. దూసుకొచ్చిన లారీ

November 21, 2022

బీహార్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వస్తున్న ఓ ట్రక్కు అదుపు తప్పి జనాలపైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో 12 మంది మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. వైశాలి జిల్లాలోని మన్హార్‌లో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో ఎనిమిది చిన్నారులు ఉన్నారు. ఓ పూజా ఊరేగింపు కార్యక్రమాన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో నిలబడి ఉండగా.. వారిపైకి ట్రక్కు దూసుకెళ్లింది. ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హాజీపూర్‌లోని సదర్‌ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతానికి లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడని.. అతడి కోసం గాలింపు చర్యలు చేపడతున్నట్లు పోలీసులు తెలిపారు.ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించనున్నట్లు పేర్కొన్నారు.