గుడ్ న్యూస్.. అప్పులు ఇస్తానంటున్న ట్రూకాలర్ - MicTv.in - Telugu News
mictv telugu

గుడ్ న్యూస్.. అప్పులు ఇస్తానంటున్న ట్రూకాలర్

November 25, 2019

అప్పులు కావలంటే ఒకప్పుడు చాలా తిప్పలు పడాల్సి పరిస్థితి ఉండేది. తెలిసిన వారు అయితేనే ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ముక్కూ మొఖం తెలియకున్నా అప్పులు పుట్టేస్తున్నాయి. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం తర్వాత వివిధ యాప్స్ సులభంగా అప్పులు ఇచ్చేస్తున్నాయి. తాజాగా ఆ రంగంలోకి ప్రముఖ యాప్ ట్రూకాలర్ కూడా చేరబోతోంది.

Truecaller

ఇప్పటి వరకు అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్‌‌ అలర్ట్ ఇచ్చే ట్రూకాలర్ యాప్ మరో  రంగంలోకి అడుగు పెట్టబోతోంది. తమ యాప్ ద్వారా అప్పులు ఇస్తామంటూ ఆ సంస్థ ప్రకటించింది. 2020 నుంచి ఫిన్‌టెక్ కంపెనీగా మారుతామని ట్రూకాలర్ కో ఫౌండర్ నమి జరింగలం చెప్పారు. ట్రూకాలర్‌‌‌‌ పే ద్వారా క్రెడిట్ ఫెసిలిటీస్‌‌ అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. దీనిపై ఇప్పటికే కొంత మందిపై పరీక్షలు జరిపామని వెల్లడించారు.

ట్రూ కాలర్ పే యాప్ పై 2 కోట్ల మంది యూజర్లు ఉన్నారని, ఈ రంగంలో మంచి స్పందన ఉండటంతో వచ్చే ఏడాది ‘ట్రూకాలర్  పే’ను అప్‌‌డేట్ చేస్తామని చెప్పారు. దీనికి భవిష్యత్‌లో మంచి ఆధరణ ఉంటుందని ఎందుకంటే మైక్రోఫైనాన్స్, క్రెడిట్‌‌ వంటి సేవలను  చేపడుతున్నామని అన్నారు. భారత్‌లో కూడా దీన్ని తీసుకురాబోతున్నట్టు ప్రకటించారు. మొత్తానికి అప్పులు కావాలనుకునేవారు ఇక నుంచి ట్రూకాలర్ ద్వారా పొందే అవకాశం లభించబోతోంది.