నిజంగానే ప్లాట్‌ఫామ్ పైకి దూసుకొచ్చిన రైలు.. పరుగో పరుగు - MicTv.in - Telugu News
mictv telugu

నిజంగానే ప్లాట్‌ఫామ్ పైకి దూసుకొచ్చిన రైలు.. పరుగో పరుగు

April 25, 2022

చెన్నైలో ప్రమాదవశాత్తూ ఓ రైలు ప్లాట్‌ఫాంపైకి దూసుకొచ్చింది. దీంతో వణికిపోయిన ప్రయాణీకులు భయంతో పరుగులు తీశారు. వివరాలు.. చెన్నై బీచ్ స్టేషన్ నుంచి తాంబవరానికి వెళ్లే విద్యుత్ రైలు యార్డు నుంచి బీచ్ స్టేషన్‌కు బయలుదేరింది. ఒకటో ప్లాట్‌ఫాం మీదకు వచ్చే క్రమంలో అదుపుతప్పి అడ్డుగోడను దాటి దుకాణాలను ఢీకొట్టింది. అందులో ప్రయాణీకులెవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు. డ్రైవరుకి మాత్రం స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో రైలు ముందువైపు రెండు బోగీలు ధ్వంసమయ్యాయి. సమచారం తెలుసుకున్న రైల్వే అధికారులు బీచ్ స్టేషన్‌కు వచ్చి బోగీలను రైలింజన్ నుంచి తొలగించేందుకు కృషి చేస్తున్నారు. కాగా, ఈ మార్గంలో వెళ్లాల్సిన రైళ్లను వేరే ప్లాట్‌ఫాం మీదుగా మళ్లించారు.