అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి అందరికీ తెలిసిందే. తన వింత నిర్ణయాలతో అమెరికాలోనే కాదు మొత్తం ప్రపంచం అంతా వ్యతిరేకతను మూటగట్టుకున్నాడు. అయితే యూఎస్ లో ఇతని మీద ఎంత వ్యతిరేకత ఉందో అంతే సపోర్ట్ కూడా ఉంది. లాస్ట్ ఎన్నికల్లో చాలా కొద్ది తేడాతోనే ట్రంప్ గెలవకుండాపోయాడు. ఇప్పుడు మళ్ళీ యూఎస్ ఎన్నికలు దగ్గర పడడంతో ట్రంప్ ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు.
ఎన్నికల్లో మరోసారి పోటీ చేయాలని ట్రంప్ నిర్ణయించుకున్నాడు. ఇప్పటికే రిపబ్లిక్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనబోతున్నట్లుగా ప్రకటించాడు. దానికోసం తన ఎన్నికల అజెండాను కూడా నిర్ణయించేసుకున్నారు. ఎప్పటిలానే అసాధ్యం అనుకునే విషయాలే తన అజెండా అంటూ ముందుకు వస్తున్నారు. దానికితోడు సంచలన ప్రకటనలు కూడా చేస్తున్నారు.
ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్ మాట్లాడుతూ రష్యా.. ఉక్రెయిన్ యుద్దంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను అధ్యక్షుడిగా ఉండి ఉంటే రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలు అయ్యేది కాదని అన్నాడు. వచ్చే ఎన్నికల్లో తాను అధ్యక్షుడిగా గెలిస్తే ఒక్క రోజులోనే యుద్దం ఆపిస్తా అంటూ ట్రంప్ ప్రకటించారు. యుద్ధం వల్ల ఎన్నో సమస్యలు వచ్చాయి. దాన్ని ఆపడంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ తీవ్రంగా విఫలం అయ్యారు అంటూ ట్రంప్ ఆరోపించారు. ట్రంప్ ప్రస్తుతం అనేక కేసుల్లో నేరారోపణ ఎదుర్కొంటున్నాడు. అయినా కూడా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాల్సిందే అని పట్టుదలతో ఉన్నాడు. తనపై కుట్ర పూరితంగా కేసులు పెట్టారని ట్రంప్ ఆరోపిస్తున్నాడు.
ఇక మరోవైపు అమెరికన్ ఇండియన్ అయిన వివేక్ రామస్వామి కూడా తనదైన ప్రచారంతో దూసుకుపోతున్నారు. తాజాగా అతను చేసిన ప్రసంగం అక్కడ పెద్ద చర్చకు దారితీసింది. స్టార్టర్స్ కోసం చైనాతో వ్యాపారం చేయకుండా అమెరికన్ సంస్థలను నిషేధిస్తానని చెప్పాడు. తాను ఎన్నికైతే ఎఫ్బీఐతో పాటు విద్యాశాఖను కూడా ప్రక్షాళన చేస్తానని.. పూర్తిగా మార్చేస్తానని హామీ ఇచ్చాడు.అమెరికాను మతం, సెక్స్ వాతావరణం చుట్టుముట్టాయని, తన తరంలో చాలా మంది పెరిగిన ‘అమెరికన్నెస్’ని ముందుకు తీసుకురావడానికి ఇది సమయం అని స్పష్టం చేశారు.
అమెరికా జాతీయ గుర్తింపు సంక్షోభంలో ఉందని అంటున్న వివేక్ జీవోపీ, కన్జర్వేటివ్లు ఇప్పుడే లేచి మేల్కొని దేశాన్ని బాగు చేయాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. జాతి లింగ వివక్షకు బదులు తన ప్రజల సామర్థ్యాల ఆధారంగా అమెరికా మరోసారి ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైందని వివేక్ రామస్వామి అన్నారు. హెన్రీ కిస్సింజర్ ప్రయోగంతో అమెరికా పూర్తిగా ముందుకెళ్ళిందని.. మరింతగా ఇలాంటివి చేపట్టడం అవసరమని వివేక్ ప్రకటించాడు.