అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు నోరుపారేసుకున్నారు. భారత్‌ను భూచిగా చూపించే ప్రయత్నం చేశారు. తన ఎన్నికల ప్రచారం సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యాతో కలిసి భారత్ ప్రపంచ పర్యావరణానికి విఘాతం కలిగిస్తోందని ఆరోపించారు. భారత్, చైనా, రష్యాలు వాయు కాలుష్యాన్ని పెంచడానికి కారణం అవుతున్నాయని అన్నారు.
పర్యావరణ పరిరక్షణకు ఉద్దేశించిన పారిస్ డీల్ నుంచి గతంలోనే వైదొలగింది. ఆ తర్వాత అవకాశం వచ్చినప్పుడల్లా దీనిపై ట్రంప్ అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నారు. పారిస్ డీల్‌తో అమెరికాకు ఎలాంటి ఉపయోగం లేదని పేర్కొంటున్నారు. మరోవైపు ప్లాస్టిక్ వాడకం తగ్గించి పేపర్ వాడాలనే వాదనను కూడా ట్రంప్ తోసిపుచ్చారు. ఇది క్రేజీ విషయం అంటూ ఎద్దేవా చేశారు. కాగా, ఇప్పటికే పలుమార్లు భారత్‌పై విమర్శలు చేసిన ట్రంప్ మరోసారి విరుచుకుపడటం విశేషం.