ఫ్రెంచి అధ్యక్షుడి చుండ్రు దులిపిన ట్రంప్ - MicTv.in - Telugu News
mictv telugu

ఫ్రెంచి అధ్యక్షుడి చుండ్రు దులిపిన ట్రంప్

April 25, 2018

అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేసినా అతిగానే చేస్తారు. హావభావాలు, మాటలు, నిర్ణయాలు.. అన్నింట్లో ఆయనగారు ఎక్స్‌ట్రానే. చూసేవాళ్లు ఏమైనా అనుకుంటారేమోనన్న సిగ్గూభయం ఆయనకు అస్సలుండవు. తాజాగా ఆయన బారిన ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్‌ మెక్రాన్‌ పడ్డారు.

అమెరికాలో పర్యటిస్తున్న మెక్రాన్‌ మంగళవారం శ్వేతసౌధంలో ట్రంప్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన కోటుపై కాస్త చుండ్రు పడింది. ట్రంప్ వెంటనే అప్రమత్తమై చేత్తో దాన్ని అక్కడికక్కడే దులిపేశారు. మెక్రాన్‌ ఇబ్బంది పడుతూనే బలవంతంగా నవ్వేశాడు. ట్రంప్ చండ్రు దులుపుతూ.. తమ మధ్య ఉన్న అనుబంధం ప్రత్యేకమైందని చెప్పుకొచ్చారు. ‘అతని కాలర్‌పై డాండ్రఫ్‌ తుడిచాను.. అతణ్ని మేం పర్‌ఫెక్ట్‌గా ఉంచాలి. ఆయన పర్‌ఫెక్ట్‌’ అని ట్రంప్‌ చలోక్తి విసిరారు. అంతకు ముందు మెక్రాన్‌ను ఆహ్వానిస్తూ ట్రంప్ ముద్దులు కూడా పెట్టారు. చేతిలో చేయ్యేసుకుని నడిచారు. మెక్రాన్ ఈ అపారమైన స్నేహానికి కాస్త ఇబ్బంది పడ్డట్లు కనిపించాడు.