జంటను విడదీసిన ట్రంపు... - MicTv.in - Telugu News
mictv telugu

జంటను విడదీసిన ట్రంపు…

July 31, 2017

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కారణంగా ఓ జంట విడిపోయింది. ట్రంప్ వల్ల ఏంటి జంట విడిపోవడం ఏమిటి అనుకుంటున్నా .?
అవును ట్రంప్ వలనే ఓ కాపురం కూలిపోయింది.ఓ మహిళ ట్రంప్ పై అభిమానంతో సెల్ఫీ దిగిన కారణంగా ఆ మహిళ తన భర్త తాను
విడిపోవడానికి ట్రంప్ కారణం అని ప్రెస్ నోట్ విడుదల చేసింది.

అస్సలు ఏం జరిగిదంటే అమెరికాలోని ప్లోరిడాకు చెందిన డేవ్, లిన్ లు 2015 లొ పెళ్లి చేసుకున్నారు.లిన్ ఒకప్పటి అమెరికన్ పుట్ బాల్
జట్టు మయామి డాల్ఫిన్ కు చీర్ లీడర్ గా పనిచేసింది. తన భర్త డేవ్ పామ్ బీచ్ కౌంటీకి అటార్నీగా వ్యవహరిస్తన్నాడు.లిన్ ట్రంప్ కి పెద్ద
అభిమాని ట్రంప్ మీద అభిమానంతో ట్రంప్ కూతురు ఇవాంకా పేరు తన పెంపుడు కుక్క కు పెట్టుకుంది. ట్రంప్ అమెరికా
అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ట్రంప్ తో పలుమార్లు సెల్పీలు దిగింది. అలా సెల్ఫీలు దిగడం డేవ్ కు నచ్చలేదు.
దానితో భార్యా, భర్తల మధ్య తరుచూ గొడవులు జరుగుతుండేవి . ఈ నేపథ్యం లో లిన్ విడాకులకు దరఖాస్తు చేసుకుంది. ఇటీవల కాలంలో
స్తానిక న్యాయప్థానం విడాకులు మంజూరు చేసింది. దాంతో తాము విడిపోవడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కారణం అని లిన్ పెర్కోంది.