ట్రంప్‌కు విడాకులు.. మునిసిపాలిటీలో ఉద్యోగం! - MicTv.in - Telugu News
mictv telugu

ట్రంప్‌కు విడాకులు.. మునిసిపాలిటీలో ఉద్యోగం!

November 9, 2020

Trump

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హోరాహోరీగా పోరాడి ఓడిన డొనాల్డ్ ట్రంప్‌ భవిష్యత్తులో ఏం చేస్తాడని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో మాదిరే చక్కగా వ్యాపారాలు చేసుకుంటాడని కొందరు, లేదు లేదు తన ఓటమిపై కోర్టుల్లో పోరాడతారని కొందరు అంటున్నారు. మరోపక్క.. ఇజ్రాయెల్‌లోని ఓ మునిసిపాలిటీ అధికారులు ఆయనకు ఉద్యోగం ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. ప్రెసిడెంట్ పని పోయినందుకు పెద్దగా బాధ పడొద్దని, తాము ఉద్యోగం ఇస్తామని జెరూసలేమ్ మునిసిపల్ ఫేస్ బుక్ ద్వారా ప్రకటించారు. దీనిపై నవ్వులతోపాటు విమర్శలు కూడా వెల్లువెత్తడంతో తర్వాత మాటమార్చారు. అనుకోకుండా ఆ పోస్ట్  పడిందని, ట్రంప్‌పై తమకు గౌరవం ఉందని చెరప్పుకొచ్చు. 

మరోపక్క.. ట్రంప్ ఇంట్లో కూడా గొడవలు ముదురుతున్నట్లు తెలుస్తోంది. భార్య మెలానియా విడాకులు కోరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ట్రంప్‌ అధికారంలో ఉండడంతో ఆమె భయపడి ఇంతకాలం విడాకులు కోరలేదని, ఇప్పుడు ఓడిపోయాడు కనుక కాపురం తెగతెంపులు చేసుకుంటోందని కథనాలు వస్తున్నాయి. అయితే అవన్నీ పుకార్లేనని ఆమె సన్నిహితులు కొట్టి పడేస్తున్నారు. ఓటమిని ఒప్పుకుని శాంతియుతంగా అధికార మార్పడి చేయాలని మెలానియా తన భర్తను కోరుతోంది. ఎన్నికల్లో అక్రమాలు జరగాయని, అసలైన విజేతను తానేనని ట్రంప్ మంకు పట్టు పట్టడం తెలిసిందే.