గండం నుంచి గట్టెక్కిన ట్రంప్..సెనెట్‌లో ఊరట - MicTv.in - Telugu News
mictv telugu

గండం నుంచి గట్టెక్కిన ట్రంప్..సెనెట్‌లో ఊరట

February 6, 2020

fnhn

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు సెనేట్‌లో భారీ ఊరట లభించింది. ఆయనపై వచ్చి అభిశంసన తీర్మానం వీగిపోయింది. ఆయన్ను నిర్థోషిగా ఆ దేశ ఎగువ సభ నిర్థోషిగా తేల్చింది. రెండు వారాల విచారణ తర్వాత ఆయనపై ఉన్న ఈ తీర్మానం వీగిపోవడంతో ఊరట లభించినట్టు అయింది. 

ట్రంప్ అధికార దుర్వినియోగానికి పాల్పుడుతున్నట్టు గతేడాది డిసెంబర్‌ 18న అభిశంసన ప్రక్రియ ప్రారంభమైంది. దీనిపై దిగువసభ ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓటేసింది. ఆ తర్వాత ఎగువసభకు వచ్చిన అభిశంసన తీర్మానంపై ఆయన్ను నిర్థోషిగా తేల్చి అనుకూలంగా వ్యవహరించారు సభ్యులు.ఓటింగ్ ప్రక్రియ ద్వారా ఈ అభియోగంపై తీర్మానం చేపట్టారు. అనుకూలంగా 52మంది..వ్యతిరేకంగా 48మంది ఓటేశారు. కాగా అధికార దుర్వినియోగంపై కూడా ఓటింగ్ జరిగింది. కానీ దీంట్లో రిపబ్లికన్‌ సెనేటర్‌ మిట్‌ రోమ్నీట్రంప్‌కు వ్యతిరేకంగా ఓటేశారు.