హైదరాబాద్‌లో ట్రంప్ కూడా మాట్లాడతారు... - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌లో ట్రంప్ కూడా మాట్లాడతారు…

November 28, 2017

హైదరాబాద్‌లో  ఈ రోజు మధ్యాహ్నం మొదలు కానున్న గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్‌లో ఇవాంకాతోపాటు ఆమె తండ్రి, అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ కూడా మాట్లాడనున్నారు. ఆయన వాషింగ్టన్ నుంచి వీడియో మాధ్యమంలో ద్వారా సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తారు. పెట్టుబడుల ఆవశ్యకత, భారత్‌తో సంబంధాలు వంటి అంశాలపై ఆయన మాట్లాడతారని తెలంగాణ పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ తెలిపారు.

అయితే ట్రంప్ కేవలం కొన్ని నిమిషాలే మాట్లాడారని సమాచారం. ఇది ముందుగానే రికార్డు చేసి ఉంటుందని కూడా భావిస్తున్నారు. సదస్సులో తండ్రీ కూతుళ్లు మాట్లాడ్డం విశేషం. 2012లో దుబాయ్ లో జరిగిన ఇదే సదస్సులో అప్పటి అమెరికా అధినేత ఒబామా కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఇప్పుడు ఆ సంప్రదాయానిన ట్రంప్ కూడా పాటిస్తున్నారు.