అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎవ్వలకు అర్ధం కాకుండా ఉన్నారు. ఓ వైపు డ్రీమర్స్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నట్లు కన్పిస్తూనే అంతలోనే చల్లటి కబుర్లు చెప్తాడు. తాజాగా అలాంటి చల్లటి కబురే చెప్పాడు. ఇప్పటికే ట్రంప్ ప్రభుత్వంలో చాలా మంది అమెరికన్ ఇండియన్లు ఉన్నారు. ఉత్తర ప్రదేశ్ కు చెందిన మనీషా సింగ్ అనే మహిళకు ప్రభుత్వంలో అత్యున్నత పదవి ఇచ్చేందుకు ట్రంప్ సిద్దం అయ్యారట. ఆమె పుట్టి పెరిగిందంతా అమెరికాలోనే, ఆమెను స్టేట్ ’ఎకనామిక్ అఫైర్స్ అసిస్టెంట్ సెకరెట్రీ’ పోస్టుకు నామినేట్ చేస్తారని అంటున్నారు.
ఇంతకు ముందు ఆమె ’బ్యూరో అండ్ బిజినెస్ అఫైర్స్’ , ’సెనేట్ ఫారిన్ రిలేషన్స్’ కమిటీల్లో పనిచేశారు. అడ్వకేట్ గా కూడా పనిచేశారు. ఇది నిజంగానే ఇండియన్లకు మంచి వార్తనే.అయితే అక్కడ పనిచేస్తున్న విదేశీయులను, ముఖ్యంగా డ్రీమర్స్ ను వెనక్కి పంపిస్తానని ట్రంప్ చేసిన ప్రకటన పట్ల ఇండియన్లలో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతున్నది. అందుకే ఎప్పుడేం చేస్తాడో, ఏ నిర్ణయం తీసుకుంటాడో ఎవ్వరికీ తెలీదు. అందుకే ట్రంప్ ను అర్థం చేసుకోవడం అంత సులభం కాదని అర్ధమవుతుంది.