భారత్‌లోనే తొలిసారి.. ట్రంప్ - మోదీ అతిపెద్ద రోడ్‌షో.! - MicTv.in - Telugu News
mictv telugu

భారత్‌లోనే తొలిసారి.. ట్రంప్ – మోదీ అతిపెద్ద రోడ్‌షో.!

February 15, 2020

Trump Modi Road Show in Gujarat

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ భారత్ రాకతో ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఆయనకు అపూర్వ స్వాగతం పలికేందుకు ప్రధాని మోదీ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సుమారు 22 కిలోమీటర్ల దూరం ఈ ఇద్దరు నేతలు కలిసి రోడ్ షో నిర్వహించనున్నారు. అహ్మదాబాద్‌లో ఈ భారీ  రోడ్ షో నిర్వహించనున్నట్టు నగర మేయర్ బిజాల్ పటేల్ వెల్లడించారు. 

ఇద్దరు అగ్రనేతల ర్యాలీ సమయంలో సుమారు 50 వేల మంది దారిపొడవునా నిలబడి వీరికి స్వాగతం పలకనున్నారు. ఇంత మంది దారి పొడవునా స్వాగతం పలకడం దేశంలోనే ఇదే తొలిసారి అంటున్నారు. అగ్రనేతలు ఎవరూ ఈ స్థాయిలో రోడ్ షో నిర్వహించలేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత ట్రంప్ సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించి మొతేరాలో నిర్మించిన క్రికెట్ స్టేడియంలో భారీ బహిరంగ సభలో మాట్లాడనున్నారు. కాగా ఈ నెల 24,25 తేదీల్లో ట్రంప్ భారత పర్యటనకు రానున్న సంగతి తెలిసిందే.