షేక్‌హ్యాండ్ ఇవ్వని ట్రంప్‌..ఆ పేపర్లు చించి పడేసిన స్పీకర్‌   - MicTv.in - Telugu News
mictv telugu

షేక్‌హ్యాండ్ ఇవ్వని ట్రంప్‌..ఆ పేపర్లు చించి పడేసిన స్పీకర్‌  

February 5, 2020

trump...

అమెరికా జాతీయ కాంగ్రెస్ సమావేశాల్లో ఆసక్తికర అంశం చోటు చేసుకుంది. అధ్యక్షుడు ట్రంప్, స్పీకర్ నాన్సీకి మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించేందుకు ఏర్పాటు చేసిన సదస్సులో స్పీకర్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ట్రంప్ ఆసక్తి చూపలేదు. దీంతో ఆమె తన చేతిలో ఉన్న ఉన్న ప్రసంగ పత్రాలను చించిపడేేసి తన నిరసన వ్యక్తం చేశారు. ఈ చర్య అందరిని ఆశ్చర్యపరిచింది. 

వాషింగ్టన్‌లోని క్యాపిటల్ హిల్‌లో సేనేట్‌, హైజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ సభ్యుల ముందు ట్రంప్ మూడవ సారి ప్రసంగించారు. ప్రసంగానికి ముందు ట్రంప్ తన దగ్గర ఉన్న ప్రసంగ ప్రతులను స్పీకర్ నాన్సీకి ఇచ్చారు. ఈ సమయంలో నాన్సీ షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. కానీ ట్రంప్ పట్టించుకోకుండా పోడియం వైపు వెళ్లారు. దీంతో కొంత సేపు తన ఆగ్రహాన్ని అనిచిపట్టుకున్న స్పీకర్ చివరకు పత్రాలను చించి ఈ రూపంలో అసహనం ప్రదర్శించారు. వీరిద్దరి చర్యతో సభ్యులంతా ఆశ్చర్యపోయారు. 

చాలా కాలంగా వీరిద్దరికి మధ్య వార్ సాగుతోంది. ప్రత్యర్థి పార్టీ డెమక్రాటిక్ పార్టీకి చెందిన నాన్సి, ఇటీవల ట్రంప్‌పై సెనెట్‌లో అభిశంసన చర్యలను ప్రారంభించారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మాటలు లేవు. ఎదురుపడిన సందర్భంలోనూ కనీసం పలకరింపులు కూడా ఉండటం లేదు.అభిశంసనకు మూల కారణమైన నాన్సీతో గత అక్టోబర్ నుంచి ట్రంప్ మాట్లాడడంలేదు. ఈ క్రమంలోనే షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ఒకరు.. ప్రసంగ పత్రాలు పత్రాలు చించి మరొకరు అసహనం బయటపెట్టుకున్నారు. కాగా  ఉక్రెయిన్ అధ్యక్షుడిని ఫోన్‌లో ట్రంప్ బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ కేసును సీరియస్‌గా తీసుకున్న సేనేట్‌ ఆయనపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.