కరోనా లెక్కలన్నీ తప్పే.. భారత్‌పై ట్రంప్ నిందలు - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా లెక్కలన్నీ తప్పే.. భారత్‌పై ట్రంప్ నిందలు

September 30, 2020

Trump on Indian Corona Update Data

భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా అధ్యక్ష అభ్యర్థుల మధ్య జరిగిన తొలి చర్చ సందర్భంగా  కరోనా అంశంపై స్పందించారు. మరణాల విషయంలో భారత్ తప్పుడు లెక్కలు చెబుతోందని వ్యాఖ్యానించారు. తమ దేశంలో మరణాల సంఖ్య తక్కువేనని సమర్ధించుకున్నారు. భారత్ కన్నా అమెరికానే ముందు వరుసలో ఉందని చెప్పారు. ఈ చర్చలో రెండు సార్లు మన దేశ ప్రస్తావన తీసుకువచ్చారు. 

కరోనా విషయంలో ఏ ప్రణాళిక లేకుండా ఎంతో మంది అమెరికన్ల ప్రాణాలు తీశారని జో బైడెన్‌ విరుచుకుపడ్డారు. మీలో ఎందరికి ఉదయం లేవగానే మీ ప్రియమైన వారు కరోనా కారణంగా మరణించటంతో ఖాళీగా ఉన్న డైనింగ్ కుర్చీలు చూడాల్సి వస్తోందని అక్కడి ప్రజలతో వ్యాఖ్యానించారు. దీనిపై వెంటనే స్పందించిన ట్రంప్ తన ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుందని అన్నారు. గణాంకాల విషయంలో భారత్‌, చైనా, రష్యాలు కచ్చితమైన గణాంకాలను వెల్లడించవని ఆరోపించారు. పర్యావరణ మార్పుల విషయంలోనూ ఆయన భారత్‌ తీరునే తప్పుబట్టారు. కాలుష్యానికి కారకులుగా అభివర్ణించారు.