నిధులు పక్కదారి.. ట్రంప్‌కు రూ.14 కోట్ల జరిమానా - MicTv.in - Telugu News
mictv telugu

నిధులు పక్కదారి.. ట్రంప్‌కు రూ.14 కోట్ల జరిమానా

November 8, 2019

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిక్కుల్లో పడ్డాడు. సంఘసేవ అని చెప్పి సేకరించిన విరాళాలను దారిమళ్లించిన కేసులో న్యూయార్క్ కోర్టు ట్రంప్ కుంటుబానికి రూ. 14 కోట్ల భారీ జరిమానా వేసింది. ఆ సొమ్మును స్వచ్ఛంద సంస్థలకు చెల్లించాలని ఆదేశించింది. 

Trump

ట్రంప్ సారథ్యంలోని ‘ట్రంప్ ఫౌండేషన్’కు అందిన విరాళాలను దుర్వినియోగం చేశారని అటార్నీ జనరల్ జేమ్స్ కోర్టుకెక్కారు. ఆ నిధులను ట్రంప్ 2016 అధ్యక్ష ఎన్నికల్లో వాడుకున్నారని ఆరోపించారు. దీనిపై జడ్జి  సాలియన్ స్కార్పుల్లా విచారణ జరిపించారు. నిధులు దారిమళ్లించినట్లు నిర్ధారణ కావడంతో 20 లక్షల డాలర్లను ట్రంప్, ఆయన కుటుంబ సభ్యులు.. 8 ఎన్జీవోలకు చెల్లించాలని ఆదేశించారు.  తీర్పుపై ట్రంప్ మండిపడ్డారు. అటార్నీ జనరల్ తనపై కక్షసాధిస్తున్నారని, ఈ కేసులో కోర్టుతో రాజీకి వచ్చామని, అయినా అటార్నీ జనరల్ కెలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదేమైనా తాము 20 లక్షల డాలర్లను సేవా సంస్థలకు ఇస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు.