వైట్ హౌజ్‌లో కరోనా ప్రకంపనలు.. ట్రంప్ పీఏకు పాజిటివ్ - MicTv.in - Telugu News
mictv telugu

వైట్ హౌజ్‌లో కరోనా ప్రకంపనలు.. ట్రంప్ పీఏకు పాజిటివ్

October 2, 2020

Trump PA Tests Positive

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నివాసం వైట్ హౌజ్‌కు కరోనా సెగ తగిలింది. ఆయన పీఏ హోప్ హిక్స్‌కు కరోనా  పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. దీంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎలాంటి లక్షణాలు లేకుండానే వ్యాధి నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. ముందు జాగ్రత్తగా  వాషింగ్టన్ డీసీకి చేరుకొని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

ఇటీవలే ఆమె క్లీవ్‌ల్యాండ్‌లో జరిగిన సమావేశంతో సహా ఆమె ఇటీవల అధ్యక్షుడితో పాటు ప్రయాణం చేశారు. ప్రచార ర్యాలీకి  కూడా వెళ్లారు. ఇవాంకా ట్రంప్‌తో కలిసి ప్రజా సంబంధాలలో పనిచేస్తున్నారు. ఇవాంకా ట్రంప్, ఆమె భర్త జారెడ్ కుష్నర్‌తో సన్నిహిత సంబంధాన్ని కొనసాగించారు. దీంతో వారిలోనూ కరోనా భయం పట్టుకుంది. ముందు జాగ్రత్తగా ట్రంప్‌కు కూడా పరీక్షలు చేశారు. అయితే  ఆయనకు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదని అధికారులు వెల్లడించారు. కాగా, ఇటీవల తరుచూ ఎన్నికల ప్రచారం కోసం పలు ప్రాంతాల్లో హిక్స్‌తో కలిసి పర్యటిస్తున్నారు.