భారతీయ టెకీలకు ట్రంప్ భారీ షాక్.. ‘సర్కారీ’ హెచ్1బీ వీసాలు రద్దు - MicTv.in - Telugu News
mictv telugu

భారతీయ టెకీలకు ట్రంప్ భారీ షాక్.. ‘సర్కారీ’ హెచ్1బీ వీసాలు రద్దు

August 4, 2020

Trump Signs New Order On H-1B Visa Hiring

అమెరికాలో ఉద్యోగం చేస్తున్న భారతీయ టెక్కీలకు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాక్ ఇచ్చారు. అమెరికాలోని ఫెడరల్ ఏజెన్సీలు విదేశీ ఉద్యోగాలను నియమించుకోకుండా నిరోధించే ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులపై సంతకం చేశారు. మరీ ముఖ్యంగా హెచ్1బీ వీసాపై తమ దేశంలో ఉంటున్న వలసదారులను కాంట్రాక్టు లేదా సబ్ కాంట్రాక్టు మీద కూడా ఫెడరల్ ఏజెన్సీలు ఉద్యోగాల్లో పెట్టుకోకూడదని ఆదేశాలు జారీ చేశారు.  దీంతో భారత్, చైనా దేశాల నుంచి ఐటీ, టెక్ నిపుణులను ఆ దేశంలోని కార్పొరేట్ కంపెనీలు హెచ్1బీ వీసాలపై విదేశీ నిపుణులను అమెరికాకు తీసుకురాలేని పరిస్థితి నెలకొంటోంది. 

అమెరికన్లను మాత్రమే ఉద్యోగాల్లో నియమించుకోవాలని వైట్ హౌజ్ లో జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ తెలిపాడు. కష్టపడి పనిచేసే అమెరికన్లను ఉద్యోగాల నుంచి తొలగించడం, ఉద్యోగాల్లోకి తీసుకోకపోవడాన్ని తన పాలనలో సహించబోనని అన్నారు. నవంబరు మాసంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ దేశంలో నిరుద్యోగ సమస్య చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో విదేశీ నిపుణుల ఉద్యోగ అవకాశాల్లో కోతపెట్టేలా ట్రంప్ నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాలు ఈ ఏడాది చివరి వరకు అమలులో ఉండనున్నాయి. ఈ నిర్ణయంతో భారతీయ ఐటీ నిపుణులకు తీవ్ర నష్టం కలిగించనుంది. ట్రంప్ నిర్ణయాన్ని అమెరికాలోని పలు కార్పొరేట్, టెక్నాలజీ సంస్థలలు వ్యతిరేకిస్తుండడం గమనార్హం.