విగ్రహాలను విరగ్గొడ్డితే జైల్లో వేస్తా.. ట్రంప్ వార్నింగ్ - MicTv.in - Telugu News
mictv telugu

విగ్రహాలను విరగ్గొడ్డితే జైల్లో వేస్తా.. ట్రంప్ వార్నింగ్

June 27, 2020

George Flaide

అగ్రరాజ్యం అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ హత్య అనంతరం నల్లజాతీయులు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. కరోనా వైరస్ బీభత్సంగా ఉన్నా అక్కడ నిరసనలు వెల్లువెత్తడం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలో నిరసనకారులు అనేక ప్రాంతాల్లో విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. ఈ చర్యపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. విగ్రహాలను ధ్వంసం చేసేవారిని జైలులో వేస్తానని హెచ్చరించారు. విగ్రహాలను కూలగొడుతున్న వారు వామపక్ష తీవ్రవాదులని, మార్కిస్టు భావాలు కలిగిన వారు అమెరికా విద్రోహులు అని ట్రంప్ అన్నారు. చరిత్రను పూర్తిగా అర్థం చేసుకోకుండా నిరసనకారులు వ్యవహరిస్తున్నట్లు ఆయన చెప్పారు.

ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. ప్రజల కోసం ఏర్పాటు చేసిన విగ్రహాలను ధ్వంసం చేసేవారిపై చట్ట ప్రకారం శిక్షించాలని ఆయన తన ఆదేశాల్లో పేర్కొన్నారు. మరోవైపు ఆందోళనకారులు ఆగడాలను నిలిపు చేయలేకపోతున్న పోలీసు శాఖలకు స్థానికంగా ఫెడరల్ ఫండ్స్ ఆపేయాలని ట్రంప్ సూచించారు. కాగా,  ఫ్లాయిడ్ మృతికి వ్యతిరేకంగా నల్లజాతీయులు.. అమెరికాను కనుగొన్న క్రిస్టోఫర్ కొలంబస్‌తో పాటు అనేక మంది ప్రముఖ వ్యక్తుల విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు.