అమెరికాలో పర్యటిస్తున్న భారత ప్రధాని నరేంద్రమోదీ ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు మధురమైన జ్ఞాపిక ను గిఫ్ట్ గా ఇచ్చారు.. భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా ఉన్న చిన్న కళాకండాలు బహుమతిగా ఇచ్చారు. అమెరికా ప్రఖ్యాతిగాంచిన అధ్యక్షుడు అబ్రహం లింకన్ శత వర్థంతి సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం భారత్‌లో 1965లో విడుదల చేసిన ఒరిజినల్ లింకన్ స్టాంప్‌ను ట్రంప్‌కు అందించారు. ‘ప్రఖ్యాతిగాంచిన అమెరికా అధ్యక్షుడు అబ్రహం లింకన్‌ను గుర్తు చేసుకుంటూ ఆయన గౌరవార్థం విడుదల చేసిన స్టాంప్’ అంటూ భారత ప్రధాని కార్యాలయం ట్విట్టర్లో పోస్ట్ చేసింది. భారత జాతిపిత గాంధీ, లింకన్ ఆదర్శాలు ఒకేలా ఉండేవని అభిప్రాయపడింది. ట్రంప్‌కు స్టాంపు ఇచ్చిన మోదీ.. ట్రంప్ భార్య మెలానియా ట్రంప్‌కు హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన హస్తకళాకండాలైన వెండి బ్రాస్లెట్, టీ, కాంగ్రా ప్రాంతానికి చెందిన తేనే, జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన హ్యాండ్ వోవెన్ షాల్స్ బహుమతిగా అందించారు. ఇందుకు ప్రతిగా మోదీకి ట్రంప్ అమెరికా శ్వేతసౌదం టూర్ గైడ్‌ను అందించారు.