ట్రంప్‌కు మరో షాక్.. కరోనా బారిన పడిన కొడుకు బారన్ - MicTv.in - Telugu News
mictv telugu

ట్రంప్‌కు మరో షాక్.. కరోనా బారిన పడిన కొడుకు బారన్

October 15, 2020

cbgcb

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నివాసంలో కరోనా మరోసారి కలకలం సృష్టించింది. ఆయన 14 ఏళ్ల కొడుకు బారన్ వైరస్ బారినపడ్డారు. అతడి తల్లి మెలానియా ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం బారన్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఎలాంటి భయం లేదని తెలిపారు. రోగ నిరోధక శక్తి బలంగా ఉండడం వల్ల వ్యాధి లక్షణాలేవీ కనిపించలేదన్నారు.  తాము ముందు ఊహించినట్టుగానే అతడికి కూడా సోకిందని పేర్కొన్నారు. 

కాగా, ఇటీవలే అధ్యక్షుడు ట్రంప్, ఆయన భార్య మహిళ మెలానియా కరోనా బారినపడి ఆ తర్వాత కోలుకున్నారు. మూడు రోజుల చికిత్స తర్వాత వారం పాటు విశ్రాంతి తీసుకున్నారు. ఆ వెంటనే ట్రంప్ ఎప్పటిలాగే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. మెలానియా ట్రంప్ మాత్రం ఇంకా క్వారంటైన్‌లోనే ఉన్నారు. ప్రస్తుతం తనకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. ఒక విధంగా ముగ్గురికి ఒకేసారి కరోనా సోకడం ఆనందమని మెలానియా పేర్కొనడం విశేషం. ఇప్పటి వరకు అమెరికాలో 78 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 2,16,000 మంది బాధితులు మృత్యువాతపడ్డారు.