ట్రంప్‌కు అచ్చిరాని తాజ్‌మహల్.. దివాలా తీశాడు..  - MicTv.in - Telugu News
mictv telugu

ట్రంప్‌కు అచ్చిరాని తాజ్‌మహల్.. దివాలా తీశాడు.. 

February 24, 2020

డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన కొనసాగుతోంది. తొలిసారి అధ్యక్ష హోదాలో భారత్‌కు వచ్చిన ఆయన పలు ప్రాంతాల్లో తిరిగారు. ఇందులో భాగంగా ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్‌మహల్‌ను కూడా సందర్శించారు. దాని విశిష్టతను గైడ్ వివరించాడు. ట్రంప్ తాజ్‌మహల్‌కు వస్తున్న నేపథ్యంలో అక్కడి పరిసరాలను చాలా సుందరంగా ముస్తాబు చేశారు. ఆయనకు మంచి అనుభూతి మిగిలేలా తీర్చిదిద్దారు. ట్రంప్ దంపతుు అక్కడి పరిసరాలు కలియతిరిగి దాని చరిత్రను తెలుసుకొని మైమరచిపోయారు. 

 ఇదిలా ఉంటే తాజ్‌మహల్‌ను ఆయన సందర్శించే కంటే ముందే అది  ఆయనకు భిన్న అనుభూతులు మిగిల్చిందట. తొలిసారి తాజ్‌మహల్ చూడటానికి వచ్చిన ఆయనకు దాని ద్వారా భిన్న అనుభవాలు ఎందుకుంటాయని అనుకుంటున్నారా. అయితే 1990 లో జరిగిన సన్నివేశాలను గుర్తు చేసుకోవాల్సిందే. వ్యాపారవేత్తగా ఉన్న ట్రంప్ అప్పట్లో న్యూజెర్సీలోని అట్లంటిక్ సిటీలో తాజ్ మాహల్ పేరుతో  క్యాసినోను ట్రంప్ ప్రారంభించారు. ఇది మొదలైన కొన్ని రోజులకే నష్టాలు రావడం ప్రారంభం అయ్యాయి. దీంతో ఆ సంస్థ రెండుసార్లు పూర్తిగా దివాలా తీసింది. 

ఆ తర్వాత దాన్ని ఎంటర్టైన్మెంట్ రిసార్ట్స్ అనే మాతృ సంస్థ కిందకు తీసుకువచ్చి నిర్వహించారు. అప్పడు లాభాల బాటపట్టి సంపాదన పెరిగింది. 2017 సంవత్సరంలో దాన్ని హార్డ్ రాక్ కేఫ్ బ్రాండ్ కు  ట్రంప్ అమ్మేశాడు. ఇప్పుడు ఆయన ఇలా తాజ్‌మహల్ నేరుగా సందర్శించడంతో ఆనాటి అనుభూతులు గుర్తుకువస్తాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 

Trump Tajmahal Casino