కరోనా లేకున్నా రోజూ గోళీ వేసుకుంటున్న ట్రంప్ - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా లేకున్నా రోజూ గోళీ వేసుకుంటున్న ట్రంప్

May 19, 2020

Trump Take Hydrasic Chloroquine Tablets

అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనాతో అప్రమత్తంగా ఉంటున్నారు. ఎందుకైనా మంచిదని అన్ని ముందు జాగ్రత్త చర్యలు పక్కాగా పాటిస్తున్నారు. దీని కోసం ప్రతి రోజూ తాను కావాల్సిన మందులు కూడా వేసుకుంటున్నానని తెలిపారు. అన్నింటికంటే ముఖ్యంగా ప్రతి రోజు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ట్యాబ్లెట్లు తప్పకుండా వేసుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు. తాను వైద్యులను దీనిపై అడిగినప్పుడు నచ్చినప్పుడు వేసుకుంటే మంచిదేనని చెప్పారని, అందుకే తాను వాడుతున్నానని తెలిపారు. 

కరోనాకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ వల్ల ఉపయోగం లేదని ఇటీవల కొన్ని పరిశోధనలు వెల్లడించాయి. అయినా కూడా ట్రంప్ వాటిని పట్టించుకోలేదు. ఆ ట్యాబ్లెట్లు వైరస్‌ను కట్టడి చేస్తాయంటూ ప్రచారం చేశారు. దీంట్లో భాగంగానే  భారత్ నుంచి పెద్ద ఎత్తున ఈ ట్యాబ్లెట్లను దిగుమతి కూడా చేసుకున్నారు. ఇలా గత వారం రోజులుగా రోజుకొకటి చొప్పున ఆయన వాటిని వాడుతున్నట్టు చెప్పారు. వీటితో పాటు జింక్ ట్యాబ్లెట్, అజిత్రోమైసిన్ ట్యాబ్లెట్ కూడా తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు.కాగా  హైడ్రాక్సీ క్లోరోక్విన్ ట్యాబ్లెట్లు ఎక్కువగా తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉందని పరిశోధకులు హెచ్చరించారు.