బాక్సర్ అవతారమెత్తిన ట్రంప్..నెటిజన్ల పరేషాన్..! - MicTv.in - Telugu News
mictv telugu

బాక్సర్ అవతారమెత్తిన ట్రంప్..నెటిజన్ల పరేషాన్..!

November 28, 2019

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏది చేసినా సంచలనమే. అప్పుడప్పుడూ ఆయన ప్రసంగాలు, అలవాట్లు అన్ని వేరుగా ఉంటాయి. తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో చేసిన పోస్టు ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. బాక్సింగ్ రింగులో కండలు తిరిగిన దేహంతో చేతికి గ్లోవ్స్ ధరించి ఉన్న తన ఫొటోను పోస్ట్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు నిజంగానే ట్రంప్ బాక్సర్‌గా మారిపోయారా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఫన్నీ కామెంట్లు పెడుతుండటంతో ఇప్పుడదని వైరల్‌గా మారింది. 

నిజానికి ట్రంప్ పోస్టు చేసింది. తన ఒరిజినల్ ఫొటో కాదు. హాలీవుడ్  హీరో సిల్వరస్టర్ స్టాలోన్ తీసిన ‘రాకీ సినిమాలోని ఫొటో.అందులో ఉన్న స్టాలోన్ ఫొటోను జాగ్రత్తగా క్రాప్ చేసి అతని తల స్థానంలో ట్రంప్ తలను తగిలించారు. ఆ ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. నిజంగా ట్రంపే అన్నట్టుగా ఉండటంతో అంతా అవాక్కయ్యారు. కాగా ఇటీవల ట్రంప్ ఆరోగ్యం సరిగాలేదనే వార్తలు రావడంతో వాటిని చెక్ పెట్టేందుకే తాను దృఢంగా ఉన్నానని తెలిసేలా ఇలా చేసినట్టు పలువురు అభిప్రాయపడుతున్నారు.