ఆడోళ్లు..ఎవరికీ అర్థం కారు..! - MicTv.in - Telugu News
mictv telugu

ఆడోళ్లు..ఎవరికీ అర్థం కారు..!

May 24, 2017

ఆడవారి మాటలకు అర్థాలే వేరులే…వారిని అర్థం చేసుకోవడం ఓ జన్మ సరిపోదంటారు.వారు ఎప్పుడు ఎలా ఉంటారో అర్థం కారు. దీనికి మాములోడైనా అమెరికా అధ్యక్షుడైనా మినహాయింపు కాదు. వారి తిక్కకు లెక్కుందో లేదో కానీ..ఒక్కోసారి పబ్లిక్ కూడా ఇబ్బంది పెట్టేస్తుంటారు.
ఆయన అమెరికా అధ్యక్షుడు. అసలే ట్రంప్..అయినా పెళ్లాం అంటే హడలే..లేదంటే పబ్లిక్ లో నవ్వులపాలు కావాల్సిందే. రియాద్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేతిని ఆయన భార్య మెలానియా విసిరి కొట్టి ప్రపంచ మీడియా ముందు పరువుతీసింది. ఇది జరిగిన 24 గంటల్లోనే మరో హైడ్రామాకి తెరలేపారు. తొలి విదేశీ పర్యటనలో ఉన్న ఈ జంట బుధవారం రోమ్‌లో అడుగుపెట్టింది. రోమ్‌లో విమానం ల్యాండ్ అవ్వగానే బయటికి వచ్చి అభివాదం చేశారు. విమానం మెట్లు దిగుతుండగా ట్రంప్ మెలానియా చేతిని అందుకునేందుకు ప్రయత్నించారు. ఆమె వెంటనే చేతిని పైకి తీసుకుని తలను సవరించుకుంటున్నట్టుగా దూరం జరిగారు. దీంతో ట్రంప్ నవ్వుతూ ఆమెను సముదాయించి ఈ విషయాన్ని కవర్ చేసేందుకు ప్రయత్నించారు.
రియాద్‌లో రెడ్ కార్పెట్ వెడల్పుగా లేకపోవడంతోనే ఆమె ట్రంప్ పక్కన కాకుండా వెనుక నడిచారనీ.. కావాలని ట్రంప్‌ చేతిని విసిరికొట్టలేదని అంతా భావించారు.కానీ ఈ సారి మాత్రం మెలానియా చేష్టలు స్పష్టంగా కనిపించడంతో ట్విటర్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మెలానియా ఇప్పటికీ ట్రంప్ చేతిని అందుకోవడం లేదనీ కొందరు కామెంట్లు చేయగా… వీరి మధ్య విభేదాలు ముదిరిపాకాన పడ్డాయంటూ మరికొందరు అంటున్నారు.

https://www.youtube.com/watch?v=C8YiO7eFiD8