ఆర్టీసీ కార్మికుల భవిష్యత్ తేల్చనున్న కేబినెట్ - MicTv.in - Telugu News
mictv telugu

ఆర్టీసీ కార్మికుల భవిష్యత్ తేల్చనున్న కేబినెట్

November 28, 2019

ఆర్టీసీ కార్మికుల ఉద్యోగ భవిష్యత్‌పై నేడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కేబినెట్ భేటీ సందర్భంగా ఈ అంశం ప్రధానంగా చర్చకు పెట్టారు. రూట్ల ప్రైవేటీకరణ, కార్మికులను ఉద్యోగాల్లోకి తీసుకునే అంశాన్ని మంత్రివర్గం చర్చించనుంది. ఇప్పటికే ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి ఉద్యోగాల్లో చేరుతామని స్పష్టం చేశారు. కానీ ప్రభుత్వం మాత్రం దీనిపై ఎటువంటి స్పందన వ్యక్తం చేయలేదు. దీంతో వారి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. భేటీ తర్వాత ప్రభుత్వం కీలక ప్రకటన చేయనుంది. 

TS Cabinet Meeting.

దాదాపు 50 వేల కుటుంబాలు ఆర్టీసీపై ఆధారపడి ఉండటంతో వారిని తిరిగి తీసుకునేందుకు ఎటువంటి చర్యలు చేపట్టాలనేది వెల్లడించే అవకాశం ఉంది.ఆర్టీసీని గట్టెక్కించేందుకు ఇప్పటికి ఇప్పుడు రూ. 650 కోట్లు అవసరం ఉంది. ఈ డబ్బు ఇచ్చేందుకు ప్రభుత్వ ఖాజానా లేకపోవడంతో ఆర్టీసీ ఆస్తులను లీజులు ఇచ్చే అంశంపై చర్చించనున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఆర్టీసీ భూములను లీజుకు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆర్టీసీని లాభదాయక సంస్థగా మార్చడానికి రూట్ల ప్రైవేటీకరణ,ఆస్తులను ఎక్కువ ఆదాయ ఉత్పత్తికి ఉపయోగించడమే అని ప్రభుత్వం భావిస్తోంది.