తెలంగాణ ప్రభుత్వానికి చెందిన తెలంగాణ చేనేత, జౌళి శాఖ కార్యాలయం…కాంట్రాక్ట్ ప్రాతిపాదికన 15 క్లస్టర్డ్ డెవలప్ మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిప్లొమా ఇన్ హ్యాండ్లూమ్ టెక్నాలజీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంతేకాదు చేనేత రంగంలో రెండేళ్లు పనిచేసిన అనుభవం కూడా ఉండాలి. MSWORD/EXCEL/POWERPOINTలకు సంబంధించి కంప్యూటీర్ పరిజ్ణానం తప్పనిసరిగా ఉండాల్సిందేనని నోటిఫికేషన్ లో పేర్కొంది.
ఆర్హతతోపాటు ఆసక్తి ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్ వెలువడిన 21రోజుల్లో The Commissioner of Handlooms & Textiles & AEPs, 3rd Floor, Chenetha Bhavan, Nampally, Hyderabad-500 001, Telangana State.ఈ అడ్రెస్సుకు పోస్టు ద్వారా దరఖాస్తు పంపించాల్సి ఉంటుంది. అనుభవం, విద్యార్హత, స్థానికత, వయస్సును ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ. 24వరకు జీతభత్యం చెల్లిస్తారు. పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ ను చెక్ చేసుకోండి.
ఇవి కూడా చదవండి
నర్సింగ్ కోర్సుకు ఫుల్ డిమాండ్..మీరు చేయాలనుకుంటే..ఈ వివరాలు తెలుసుకోండి..!!