Home > విద్య & ఉద్యోగాలు > ఇంజినీరింగ్‌ ఎంట్రెన్స్ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

ఇంజినీరింగ్‌ ఎంట్రెన్స్ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

TS EAMCET Counselling 2023 Schedule Released

గురువారం (మే 25) తెలంగాణ ఎంసెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఫలితాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈ క్రమంలో జూన్ 26 నుంచి ఆగస్టు 9 వరకు మూడు విడతల్లో ప్రవేశాల కౌన్సెలింగ్ ఉంటుంది. మొదటి కౌన్సెలింగ్ కోసం జూన్ 26న ఆన్ లైన్ లో ఫీజు చెల్లించి, సర్టిఫికెట్లతో స్లాట్ బుకింగ్ చేసుకోవాలి.

జూన్ 28 నుంచి జులై 6 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుగుతుంది. జూన్ 28 నుంచి జులై 8 వరకు ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. జులై 12న మొదటి విడత ఇంజినీరింగ్ సీట్లను కేటాయిస్తారు. సీట్ పొందిన స్టూడెంట్స్ జులై 12 నుంచి 19 వరకు ఆన్ లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవ్వాలి. సెకండ్ కౌన్సెలింగ్ జులై 21 నుంచి మొదలవనుంది.

జులై 21 నుంచి 24 వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. జులై 28న సీట్ల కేటాయింపు, ఆగస్టు 2 నుంచి తుది విడత ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ మొదలుపెట్టనున్నారు. ఆగస్టు 2 నుంచి 4 వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఆగస్టు 7 నుంచి ఇంజినీరింగ్ తుది విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. ఆగస్టు 7 నుంచి 9 వరకు కాలేజీల్లో చేరొచ్చు. ఆగస్టు 8న స్పాట్ అడ్మిషన్లపై మార్గదర్శకాల విడుదల చేస్తారు.

Updated : 27 May 2023 8:29 AM GMT
Tags:    
Next Story
Share it
Top