TS ECET 2022 Exam Date: Telangana ECET Exam Date Finalised
mictv telugu

వాయిదా ప‌డ్డ ఎంసెట్ అగ్రిక‌ల్చర్, ఈసెట్ ప‌రీక్ష తేదీలు ఖ‌రారు

July 19, 2022

తెలంగాణలో ఇటీవలి వరకు భారీ వర్షాలు అతలాకుతలం చేయడం తెలిసిందే. దానికితోడు వరదలు సంభవించాయి. దాంతో తెలంగాణలో ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్ష వాయిదాపడింది. తాజాగా ఈ పరీక్షకు కొత్త తేదీలు ప్రకటించారు. తెలంగాణ ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షను ఈ నెల 30, 31 తేదీల్లో నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి వెల్లడించారు. అంతేకాకుండా, ఆగస్టు 1న ఈసెట్, ఆగస్టు 2 నుంచి 5వ తేదీ వరకు పీజీఈసెట్ పరీక్షలు జరపనున్నట్టు వివరించారు. అభ్యర్థులు సంబంధిత వెబ్ సైట్ల నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు.