సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సీరియస్ వ్యాఖ్యలు చేశారు. శనివారం రాజ్‌భవన్‌లో నిర్వహించిన మహిళా దర్బార్ కార్యక్రమంలో ఈ ఘటన గురించి మాట్లాడారు. ‘రేప్ కేసుకు సంబంధించి రెండు రోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించాను. కానీ, ఇంతవరకు ఇవ్వలేదు. ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వాన్ని నేను గౌరవిస్తాను. కానీ, ప్రభుత్వం కూడా అలాగే రాజ్‌భవన్‌ను గౌరవించాలి. ప్రోటోకాల్ పాటించకుండా నన్ను అవమానించినా అది నన్ను అడ్డుకోలేదు. తెలంగాణకు సేవ చేసే లక్ష్యంతో పని చేస్తున్న నేను వివాదాస్పద వ్యక్తిని కాదు’ అంటూ పేర్కొన్నారు.