టీచర్ ఉద్యోగాల కోసం ప్రిపేరవుతున్న అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు మార్చి 26 నుంచి ఏప్రిల్ 12 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని అందులో పేర్కొంది. జూన్ 12న పరీక్ష నిర్వహించనున్నట్టు తెలిపింది. దాదాపు 7 ఏళ్ల తర్వాత టెట్ నోటిఫికేషన్ రావడంతో ఉపాధ్యాయ నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, టెట్ కాలపరిమితిని జీవిత కాలానికి పొడిగించిన విషయం తెలిసిందే.