పాపాల చిట్టా తయారు చేస్తోన్న హరీష్ రావు..! - MicTv.in - Telugu News
mictv telugu

పాపాల చిట్టా తయారు చేస్తోన్న హరీష్ రావు..!

June 15, 2017


భూ వివాదం బుసలు కొడుతోంది.అధికార,విపక్షాల మధ్య భగ భగ మండుతోంది.కూల్ కూల్ వెదర్ లో హాట్ హాట్ కామెంట్స్ పొలిటికల్ హీట్ ని పెంచుతున్నాయి. మైకేసుకుని ఏదీపడితే మాట్లాడం కాదు.. దమ్ముంటే ఆధారాలతో సహా నిరూపించాలని సర్కార్ సవాల్ విసురుతోంది. లేకుంటే ఆబిడ్స్ లో ముక్కు నేలకు రాయాలంటోన్న మంత్రి హరీష్ రావు… పాపాల చిట్టాను తయారు చేస్తున్నారు. ఇంతకీ ఈ పాపాల చిట్టాలో ఎవరెవరు ఉన్నారు..?గులాబీ లీక్స్ ముళ్లు ఎవరికి గుచ్చుకుంటాయ్..?

తెలంగాణలో మియాపూర్ భూ వివాదం మంటలు రేపుతోంది. భూ వివాదాన్ని సీఎం కేసీఆర్ బయట పెడితే… ఆ భూముల దగ్గర ఫోటోలకు ఫోజులిచ్చి సర్కార్ పై బురదచల్లే కుట్రలకు కాంగ్రెస్ నేతలు తెరలేపారని మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు భూ కుంభకోణంలో ఉన్నారని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్ట కాల్చి మీదేయడం కాదు…దమ్ముంటే ఆధారాలతో నిరూపించాలని..లేకుంటే ఆబిడ్స్ లో ముక్కు నేలకు రాయాలని సవాల్ విసిరారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మంత్రి హరీష్ రావు…60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ , టీడీపీల హయాంలలో జాగీరుదారుల భూముల విషయంలో కఠినమైన నిర్ణయాలు తీసుకోని కారణంగానే ఇప్పుడు రిజిస్ట్రేషన్ల ఆఫీసులు అక్రమాలకు అడ్డగా మారాయని విరుచుకుపడ్డారు. ” నిజాం హయాంలో ఉన్న జాగీర్ భూములను అప్పట్లోనే ప్రభుత్వాలు తగిన పరిహారం చెల్లించి స్వాధీనం చేసుకున్నాయి
.ఆ తర్వాత వారసులమని చెప్పుకుంటూ వివాదాలు సృష్టించే వారు .అప్పటి కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వాలు పట్టించుకోననందువల్లే ఈ పాపాలు వారసత్వంగా వచ్చాయి .సీఎం కేసీఆర్ లోతుల్లోకి వెళ్లి ఈ వివాదాన్ని బయట పెట్టారు ..విపక్షాలు కావు

…1971 జాగీర్దార్ భూ చట్టం లో సమూల మార్పులు తెస్తాం ..దీంతో ఈ వివాదాలకు తెర దించుతాం

…విపక్షాలు బురద చల్లే యత్నం చేస్తున్నాయి తప్ప ఒక్క డాక్యుమెంట్ ను బయట పెట్టాయా ?

…భూముల దగ్గరకు వెళ్లి ఫోటోలు దిగడం తప్ప విపక్ష నేతలు చేసిందేమిటి ?

…ఇప్పటికే రిజిస్ట్రేషన్ల శాఖను ప్రక్షాళన చేశాం

…ఎనీవేర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ను రద్దు చేశాం

…సబ్ రిజిస్ట్రార్ విచక్షణాధికారాలను రద్దు చేశాం

…రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో లంచాలను పెంచి పోషించింది కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వాలు కాదా ?

…రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో లంచాల సంస్కృతిని నిర్ములించేందుకు త్వరలోనే కొత్త విధానం

…మియాపూర్ భూముల్లో ఎం కుంభ కోణం జరిగిందో ఉత్తమ్ తదితర నేతలు చెప్పాలి

…ఒక్క గజం భూమి పోలేదు ఒక్క రూపాయి ప్రభుత్వానికి నష్టం కలుగలేదు

…ఒక్క రిజిస్ట్రేషన్ విషయం లోనే కొంత అవకతవకలు జరిగాయి

…ప్రభుత్వం అనేక దిద్దుబాటు చర్యలు తీసుకుంది

…కెసిఆర్ కుటుంబ సభ్యులకు ఈ కుంభ కోణం తో సంబంధముందంటున్న ఉత్తమ్ చేతనైతే దాన్ని నిరూపించాలి

…నిరూపించకపోతే అబిడ్స్ చౌరాస్తాలో ఉత్తమ్ ముక్కు నేలకు రాయాలి” అని హరీష్ రావు అన్నారు.

ప్రభుత్వాన్ని ఏ అంశం మీద విమర్శించడానికి లేకే విపక్షాలు మియాపూర్ భూముల అంశం పై రా ద్ధాంతం చేస్తున్నాయని హరీష్ రావు మండిపడ్డారు.”ఇక మేము కూడా విపక్ష నేతల చిట్టాలను బయట పెడతాం

…ఎంతటి వారున్నా వదిలి పెట్టం” కోదండరాం కు ప్రభుత్వం కంపు లాగా ఎందుకు కనబడుతుందో అర్ధం కావడం లేదు

…కాంగ్రెస్ నేతల కంపు కోదండరాం కు కనబడడం లేదా ?

…ఆయన ప్రొఫెస్సరా మరేమిటో అర్ధం కాదు

…ఉద్యమ సమయం లో చెప్పినవే కేసీఆర్ అమలు చేస్తున్నారనే విషయం కోదండ రాం కు తెలియదా “అని హరీష్ రావు అన్నారు.
అసలు మియాపూర్ లో ఏం జరిగిదంటే…

“మియాపూర్ లో 810 ఎకరాల ప్రభుత్వ భూమిపై ప్రైవేట్ వ్యక్తులకు లిటిగేషన్ రైట్స్ కలిపిస్తూ సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేశారు. వాస్తవానికి ఇది భూ బదలాయింపు రిజిస్ట్రేషన్ కాదని, లిటిగేషన్ రైట్స్ కు సంబంధించిన రిజిస్ట్రేషన్. ఒకవేళ అది భూ బదలాయింపు రిజిస్ట్రేషన్ అయితే మొత్తం భూమి విలువకు రిజిస్ట్రేషన్ చార్జీ రూ.415 కోట్లు అయ్యేదని, కానీ ఈ రిజిస్ట్రేషన్ కోసం రూ.60 లక్షలు కట్టారని ఇక ల్యాండ్ రిజిస్ట్రేషన్ స్థిరాస్థి రిజిస్టేషన్ చేయాల్సి ఉంటుందని..అంటే భూమి బదలాయింపు రిజిస్ట్రేషన్ బుక్ -1లో చేయాలని, కానీ ఇక్కడ చరాస్థి రిజిస్ట్రేషన్ జరిగే బుక్ -4లో రిజిస్ట్రేషన్ చేశారని, కాబట్టి ఈ రిజిస్ట్రేషన్ కు విలువలేదని,ఎక్కడా చెల్లుబాటు కాదు” అని హరీష్ రావు చెప్పారు.
మొత్తానికి పాపాల చిట్టా తయారు చేసి… రోజుకొకటి బయటపెడుతానంటోన్న హరీష్ ..కాస్కోండి కాంగ్రెస్ నేతల్లారా అంటున్నారు. చూడాలి మరి కాంగ్రెస్ నేతలు ఆధారాలు చూపిస్తారో లేదో…