Home > Featured > నేడు గవర్నర్ నరసింహన్‌కు వీడ్కోలు

నేడు గవర్నర్ నరసింహన్‌కు వీడ్కోలు

Narasimhan.

సుదీర్ఘకాలం తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా పనిచేసిన నరసింహన్ పదవి బాధ్యతలు నేటితో ముగియనున్నాయి. రేపు కొత్త గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆయనకు నేడు వీడ్కోలు పలకనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ మంత్రులు, పాల్గొననున్నారు. అనంతరం ఆయన చెన్నైలోని తన నివాసానికి వెళ్లిపోనున్నారు.

తెలంగాణ ఉద్యమ సమయంలోనూ, రాష్ట్ర విభజనలోనూ ఎంతో చతురత ప్రదర్శించారు. రెండు తెలుగు రాష్ట్రాల సమస్యలను పరిష్కరించడంలోనూ ఆయన ప్రతిసారి పెద్దన్న పాత్ర పోషించారు. తన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి దేశంలోనే అతి ఎక్కువగా కాలం గవర్నర్‌గా పనిచేసిన వ్యక్తిగా నిలిచారు. చెన్నైలోని తన నివాసంలో ఉండేందుకే ఆయన మొగ్గుచూపుతున్నారు. పదవి విరమణ తర్వాత ప్రశాంతంగా జీవితాన్ని గడపనున్నట్టు ఇటీవల తెలిపారు. కాగా రేపు కొత్త గవర్నర్ ప్రమాణ స్వీకారానికి కూడా రాజ్‌భవన్ వర్గాలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి.

Updated : 6 Sep 2019 11:57 PM GMT
Tags:    
Next Story
Share it
Top