Home > Featured > జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిశోర్ బదిలీ.. కొత్త కమిషనర్..

జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిశోర్ బదిలీ.. కొత్త కమిషనర్..

Ts Govt Transfer Ghmc Commissioner

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ దాన కిషోర్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. సోమవారం దీనికి సంబంధించిన ఉత్తర్వులను అధికారులు విడుదల చేశారు. జలమండలి ఎండీగా కొనసాగేందుకు ఆయనకు బాధ్యతలు అప్పగించారు. ఆయన స్థానంలో రంగారెడ్డి కలెక్టర్ లోకేశ్ కుమార్‌ను నియమించారు. మరోవైపు రంగారెడ్డి జాయింట్ కలెక్టర్‌గా పనిచేస్తున్న హరీష్‌కు కలెక్టర్‌గా బాధ్యలు అప్పగించారు. కాగా జీహెచ్ఎంసీ కమిషనర్‌గా, జలమండలి ఎండీగా దాన కిశోర్ ఏడాది పాటు సేవలను అందించారు. తాజా ఉత్తర్వులతో ఆయన కేవలం జలమండలికి మాత్రమే పరిమితం కానున్నారు. దీంతో జీహెచ్ఎంసీ కొత్త కమిషనర్‌గా లోకేశ్ కుమార్ త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు.

Updated : 26 Aug 2019 9:20 AM GMT
Tags:    
Next Story
Share it
Top