దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్టు.... - MicTv.in - Telugu News
mictv telugu

దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్టు….

June 8, 2017

సుగంద ద్రవ్యాల అమ్మకం-కొనుగోలుదారుల సమావేశంలో

మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు పాల్గోన్నారు”ఇతర దేశాలలో నిషేధానికి గురైన పురుగు మందులను తెలంగాణ లొనూ వాడకుండా చర్యలు తీసుకోవాలని హరీష్ రావు ఈ సందర్భంగా అన్నారు.దీనిపై రైతులలో చైతన్యం తీసుకు రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆహార ఉత్పత్తుల వినియోగంలో కొన్ని దేశాలు అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తాయని గుర్తుచేశారు.మోతాదుకు మించిన పురుగుమందులు,ఎరువుల వాడకం పై ఆ దేశాల్లో వ్యతిరేక త ఉన్న విషయాన్ని సమావేశంలో పాల్గోన్నవారికి తెలిపారు.చైనాలో ఇప్పుడు అల్లం, పసుపు,మిర్చి వంటి పంటలు పండిస్తున్నారు. మనదగ్గర పండించే ‘తేజ’రకం మిర్చికి అక్కడి మిర్చిని కలిపి పౌడర్ తయారు చేస్తున్నారు. ఆ పౌడరును విదేశాలకు భారీగా ఎగుమతి చేస్తున్నారని తెలిపారు.
రైతులకు

మద్దతు ధర నిర్ణయం అధికారం కేంద్రం చేతులో ఉందని,దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్టు కేంద్రం ఆలస్యం గా స్పందిస్తున్నది విమర్శించారు.రైతులకు మద్దతు ధర విషయంలో రాష్ట్రాలతో కేంద్రం సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు మంత్రి హరీష్ రావు. అప్పుడే రైతుకు న్యాయం జరుగుతుందన్నారు.సి.ఎం.కేసీఆర్ స్వయంగా రైతు కనుక ఆయనకు రైతుల కష్టం తెలుసు.
ఒక్క గింజ లేకుండా రాష్ట్రంలో 21 లక్షల మెట్రిక్ టన్నుల కందులు కొనుగోలు చేసాం.
కందుల ఉత్పత్తి పెరిగి ధర తగ్గింది.

కందుల ధర తగ్గడానికి ఎగుమతులను నిషేధమే కారణమని పెర్కోన్నారు.దిగుబడి తగ్గడంతో మక్కలు మద్దతు ధరకంటే ఎక్కువకు అమ్మకం జరిగిందని తెలిపారు.పత్తి అంశంలో ఇతర దేశాలు, రాష్ట్రాల్లో దిగిబడి తగ్గింది. అందుకే ఉన్నట్టుండి పత్తికి ధర వచ్చింది.ఈ సారి భూమికి బరువైనంతగా 60 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండింది.41 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఇప్పటికే కొనుగోలు చేసాం.వరి ధాన్యం కొనుగోలుకు 6వేల కోట్లు ఖర్చు చేసాం.ఏ ఇబ్బంది లేదు.మిర్చి విషయం లో

రాష్ట్ర పరిధిలోని దానికంటే ఎక్కువగా కృషి చేస్తున్నాం అని తెలిపారు మంత్రి హరీష్..
గతంలో ఎరువులు, విత్తనాలు కావాలంటే పోలీస్ స్టేషన్ ముందు క్యూ కట్టేవారు..
స్వ రాష్ట్రంలో అన్నిఅందుబాటులో ఉన్నాయి.

పగటిపూట 9 గంటల కరెంటు ఇస్తున్నాం.హైదరాబాద్ కు ఇతర రాష్ట్రాల నుండి కూరగాయల దిగుబడి శాతం 70-80నుండి తగ్గింది.
దినంతటికి కారణం పగటిపూటకరెంటు ఇవ్వడమే.

సింగల్ మార్కెట్ లైసెన్స్ విధానంతో ఎగుమతిదారులు రావడం వల్ల ధర పెరిగే అవకాశం ఉంది.పెస్టిసైడ్ ఫ్రీ పంటల కోసం కృషి జరగాలని అన్నారు.