పిల్లొడు జానెడు..బ్యాగ్ మూరెడు...బ్యాగ్ భారం తగ్గింపుపై కొత్త రూల్స్ - MicTv.in - Telugu News
mictv telugu

పిల్లొడు జానెడు..బ్యాగ్ మూరెడు…బ్యాగ్ భారం తగ్గింపుపై కొత్త రూల్స్

July 19, 2017

శనివారం వచ్చిదంటే నో బ్యాగ్ డే. ఈరోజు వస్తే విద్యార్థులు లేచిందే లేడీ పిల్లల్లా చెంగు చెంగున స్కూల్ కు పరుగెడుతారు. మండే వచ్చిదంటే మాత్రం వారి వెన్నులో వణుకే. భుజాలపై మోయలేని భారం పడుతుంది. ఒక్క సాటర్ డే నాడే నో బ్యాగ్ డే పెట్టిన స్కూళ్ల యాజమాన్యాలు…మిగతా రోజుల్లో విద్యార్థుల వెన్ను విరుస్తున్నాయి. అవసరం ఉన్నా లేకున్నా పుస్తకాల్ని మోపిస్తూ విద్యార్థుల్ని గూనొళ్లని చేస్తున్నాయి. స్కూల్ బ్యాగ్ ల బరువు తగ్గించాలని ఇప్పటికే ఎన్నో జీవోలు వచ్చినా యాజమాన్యాలు డోంట్ కేర్.గూడ్స్ బండిలా అడుగులు వేసే విద్యార్థి ఆవేదనను అర్థం చేసుకోలేకపోతున్నాయి. వీపున మోయలేని భారం వాటి కళ్లకు కనిపించడం లేదు. ఇప్పుడు లేటెస్ట్ గా బరువైన స్కూల్ బ్యాగ్ లు వద్దని తెలంగాణ సర్కార్ తెచ్చిన జీవో సూపర్..కానీ ఎన్ని స్కూళ్లు వీటిని పక్కాగా అమలు చేస్తాయనేది డౌట్..ఈ జీవో చూసైనా యాజమాన్యాలు కళ్లు తెరుస్తాయా..? విద్యార్థుల భుజాలపై భారాన్ని తగ్గిస్తాయా..?

పిల్లొడు జానెడు..బ్యాగ్ మూరెడు…చదువేమో చిన్నదాయె..మోత భారమయె.ఎనర్జిటిక్ గా ఉండే చిన్నారులు వీపున బ్యాగ్ వేసుకోగానే కుంగుబాటు.చదివేది ఎల్ కేజీ అయినా బ్యాగ్ బరువు ఏడుకేజీలపైనే. దేశంలోని 13 ఏళ్ల లోపు విద్యార్థులు సామర్థ్యానికి మించిన బరువులు మోస్తున్నారు.హోం వర్క్ ,డ్రాయింగ్ అంటూ కేజీల కొద్ది బరువు మోపిస్తున్నారు.దీంతో పిల్లలకు వెన్ను నొప్పి గూని వస్తున్నాయి.

ఇలా విద్యార్థుల బాధల చూసిన తెలంగాణ విద్యాశాఖ…బ్యాగ్ భారం తగ్గింపుపై కొత్త రూల్స్ ను తెచ్చింది. తరగతుల వారీగా గరిష్ఠ బరువు ఎంతో పేర్కొంటూ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు మోస్తున్న బ్యాగ్ బరువును విద్యాశాఖాధికారులు పరిశీలించారు. ప్రాథమిక స్థాయిలో 6 నుంచి 12 కిలోలు, ఉన్నత పాఠశాల స్థాయిలో 12నుంచి 17 కిలోలు చొప్పున ఉన్నట్లు గుర్తించారు. ఇది పిల్లల పెరుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, వెన్నెముక, మోకాళ్లపై భారం పడుతుందని నిర్ధారణకు వచ్చారు.

ఈ మోతకు టాటా చెప్పేలా కొత్త రూల్స్ ను పెట్టారు. బ్యాగ్ లో ఎస్‌సీఈఆర్‌టీ నిర్దేశించిన మేరకే పాఠ్య పుస్తకాల సంఖ్య ఉండాలని, గైడ్లు, ఇతర అనవసర విద్యా సంబంధ పుస్తకాలను ప్రోత్సహించరాదని తెలిపింది.

#ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు (6-10 తరగతులు)

#పాఠ్య ప్రణాళిక ప్రకారం 6, 7 తరగతులకు ఆరు (మూడు భాషా సంబంధ, మిగిలినవి గణితం, సైన్స్‌, సాంఘిక శాస్త్రం), 8-10 తరగతులకు ఏడు (సైన్స్‌లో భౌతిక, జీవ శాస్త్రాలు కలిపి) పాఠ్య పుస్తకాలుంటాయి.

# ఒక్కో సబ్జెక్టుకు 200 పేజీలకు మించిన నోటు బుక్ ఉండరాదు. అన్ని సబ్జెక్టులకు కలిపి ఒకటే రఫ్‌ నోట్‌ పుస్తకం ఉండాలి.

# పాఠ్యాంశం చివరన ఇచ్చే అభ్యాసన ప్రక్రియ టీచర్ల పర్యవేక్షణలో స్కూల్ టైమ్ లోనే పూర్తిచేయాలి. అందుకు ప్రత్యేక స్టడీ అవర్స్ కేటాయించాలి.

#ఏ సబ్జెక్టుకు ఏ రోజుల్లో హోంవర్క్‌ ఇస్తారో ముందుగానే ప్లానింగ్ చేయాలి

*యాజమాన్యాలు తీసుకోవాల్సిన చర్యలివీ..:

#బ్యాగ్ బరువు శరీరంపై సమానంగా ఉండేలా వెడల్పు పట్టీలున్న బ్యాగులను ఎంపిక చేసుకునేలా పిల్లలు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి.

#ఎస్‌సీఈఆర్‌టీ సూచించినవి తప్ప మిగతా పుస్తకాలను యాజమాన్యాలు సూచించరాదు. తరచూ సంచులు తనిఖీ చేయడం ద్వారా అవసరం లేని వాటిని తీసుకొస్తున్నారేమో చూడాలి

బరువు తగ్గింపు మార్గదర్శకాలు (ప్రాథమిక పాఠశాలలకు)

#1, 2 తరగతుల విద్యార్థుల సంచిలో మాతృభాష, ఆంగ్లం, గణితం.., 3, 4, 5 తరగతులకు మాతృభాష, ఆంగ్లం, గణితం, పర్యావరణ విద్య    పాఠ్య పుస్తకాలే ఉండాలి. లెసెన్స్ ఎక్సర్‌సైజ్‌, ప్రాజెక్టులు, వారం పరీక్షల కోసం ఒక్కో సబ్జెక్టు 100 పేజీలకు మించని నోటు బుక్ మాత్రమే ఉండాలి.

# రక్షిత తాగు నీటిని స్కూళ్లే సమకూర్చాలి. దానివల్ల ఇంటి నుంచి నీళ్లు తెచ్చుకునే పని ఉండదు.

#5వ తరగతి వరకు హోం వర్క్‌ ఇవ్వరాదు. దాన్ని స్కూళ్లల్లోనే చేయించాలి. అవసరమైతే అందుకు ప్రత్యేక పీరియడ్‌ కేటాయించుకోవాలి.

ఈ జీవోను చూసి విద్యార్థులు, తల్లిదండ్రులు తెగ సంతోషిస్తున్నారు. హమ్మయ్య బ్యాగ్ బరువు తగ్గుతుందని అనుకుంటున్నారు. కానీ ఈ రూల్స్ ను స్కూళ్లు తుచ తప్పక పాటిస్తాయా..?పాటిస్తే అందరూ హ్యాపీయే..సరిగ్గా అమలు చేయకపోతేనే సమస్య. ఇంతకు ముందు చాలా జీవోలు వచ్చాయి. ఏ స్కూల్ కు చెవికి ఎక్కలేదు. ఇప్పుడు కూడా ఎక్కుతుందో లేదో..?

కొన్ని ప్రైవేట్ స్కూళ్లు ఇప్పటికే శనివారం నో బ్యాగ్ డే పాటిస్తున్నాయి. మిగతా రోజులు కూడా లైట్ బ్యాగ్ డే పాటిస్తే అందరూ హ్యాపీగా ఉంటారు.బ్యాగ్ ల బరువులు తగ్గిస్తే స్కూళ్లకు పోయేది ఏం లేదు..కొంచెం పని తప్ప.ఎలాగూ విద్యార్థులకు సెపరేట్ డెస్క్ లు ఉంటాయి.అందులోనే అన్ని బుక్స్ ఉంచాలి. ఇంటికి అవసరమైనా బుక్స్ నే పంపాలి.ఈ బాధ్యత క్లాస్ టీచర్ కే అప్పగిస్తే చాలు…పక్కాగా చూసుంటారు. మధ్య మధ్యలో ప్రిన్సిపల్ కూడా పిల్లల బ్యాగ్ లను చెక్ చేస్తూ ఉండాలి.లైట్ వెయిట్ కు మించి ఉంటే బాధ్యుల్ని మందలించాలి. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు ఇలా చేస్తే పక్కాగా అమలు అవుతుంది.