తెలంగాణ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌‌కు బ్రేక్.. హైకోర్టు ఆదేశం - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌‌కు బ్రేక్.. హైకోర్టు ఆదేశం

October 28, 2020

తెలంగాణ ఎంసెట్‌ రెండో విడత కౌన్సెలింగ్‌కు బ్రేక్ పడింది. కౌన్సిలింగ్ ఆపాలని జేఎన్టీయూను హైకోర్టు ఆదేశించింది. ఇటీవల కొంత మంది విద్యార్థులు వేసిన పిటిషన్ విచారించిన ధర్మాసనం బుధవారం ఈ సూచనలు చేసింది. దీంతో రెండో విడత కౌన్సిలింగ్‌కు అడ్డంకులు ఏర్పడ్డాయి. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు సీట్ల భర్తీ చేయకూడదని పేర్కొంది. 

కోవిడ్ కారణంగా చాలా రోజుల పాటు పరీక్షలు వాయిదా పడుతూ వచ్చాయి. గత సెప్టెంబర్ నెలలో పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించారు. ఆ వెంటనే కౌన్సిలింగ్ కూడా ప్రారంభించారు. అయితే కరోనా నేపథ్యంలో వార్షిక పరీక్షల ఫలితాలను కనీస మార్కులు అంటే 35తో విద్యార్థులను పాస్ చేశారు. ఎంసెట్ నిబంధనల ప్రకారం వార్షిక పరీక్షలలో 45 శాతం మార్కులు తప్పనిసరిగా రావాలి. దీంతో విద్యార్థులు పెద్ద ఎత్తున ఎంసెట్ అర్హత కోల్పోయారు. దీనిపై అభ్యంతరం చెబుతూ విద్యార్థులు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఎంసెట్‌ నిబంధనలు సవరిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేస్తుందని హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ తెలిపారు.