TS High Court rejected the request of Minister Koppula Eshwar
mictv telugu

మంత్రి కొప్పులకు హైకోర్టులో ఎదురుదెబ్బ.. త్వరలో విచారణ

June 28, 2022

TS High Court rejected the request of Minister Koppula Eshwar

తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి నియోజవర్గం నుంచి టీఆర్ఎస్ తరపున కొప్పుల ఈశ్వర్ , కాంగ్రెస్ తరఫున అడ్లూరీ లక్ష్మణ్ పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కొప్పుల ఈశ్వర్ విజయం సాధించారు. అయితే కొప్పుల ఈశ్వర్ ఎన్నిక సరికాదని.. కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల ఫలితాల్లో అవకతవకలు జరిగాయని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈవీఎంల వీవీ ప్యాట్‌లు లెక్కించకుండానే కొప్పుల ఈశ్వర్‌ గెలుపొందినట్టు ప్రకటించారని, అది ప్రజా ప్రాతినిధ్య చట్టానికి విరుద్ధమని 2019లో అడ్లూరి లక్ష్మణ్ హైకోర్టును ఆశ్రయించారు.

అయితే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేయాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. మంత్రి కొప్పుల ఈశ్వర్ దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. లక్ష్మణ్‌ పిటిషన్‌పై త్వరలో హైకోర్టు విచారణ చేపట్టనుంది.