TS Inter Supplementary Results 2022: Result out at tsbie.cgg.gov.in
mictv telugu

ఇంటర్‌ సెకండియర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ విడుదల.. క్లిక్ చేయండి

August 30, 2022

తెలంగాణ ఇంటర్ సెకండియర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ విడుదల చేశారు. ఎంసెట్‌ కౌన్సిలింగ్‌ ఉన్నందున కేవలం సెకండియర్ ఇంటర్‌ ఫలితాలు మాత్రమే విడుదల చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆగస్టు 1 నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షకు దాదాపు 1.13లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.

ఇంటర్ సెకండ్ ఇయర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు https://tsbie.cgg.gov.in/ వెబ్‌సైట్ లో అందుబాటులో ఉంచినట్లు ఉమర్‌ జలీల్‌ తెలిపారు. అంతేకాకుండా.. సాయంత్రం నుంచి https://tsbie.cgg.gov.in/ వెబ్‌సైట్‌లో మొదటి సంవత్సరం ఫలితాలు అందుబాటు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం లో రెగ్యులర్ సప్లిమెంటరీ కలిపి 80.80 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన వెల్లడించారు.