మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆరేనని ఐటీ,పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ తేల్చిచెప్పారు. ముచ్చటగా మూడోసారి రాబోయేది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు. నాకు తెలుసు,మీకు తెలుసు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేది సీఎం కేసీఆరే..వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమే అని కుంబబద్దలు కొట్టారు. ఇక్కడో విషయం కేటీఆర్ క్లియర్ కట్‌గా చెప్పేశారు. తనపై ఊహాగానాలకు అవకాశమే లేకుండా చేశారు.ఇంకేవరు ఇప్పట్లో కేటీఆర్ సీఎం అవుతారని వ్యాఖ్యలు చేయరు. 2023 ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి గులాబీ జెండా ఎగిరినా కేసీఆర్ సీఎం అవుతారని సుస్పష్టం.కానీ మంత్రి కేటీఆర్ ఇప్పుడు ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటల వెనుక ఉద్దేశం ఏంటి?
ఇక ముందు…
కేటీఆర్ సీఎం అవుతున్నారు..ఇప్పుడు అప్పుడు మూహూర్తం అంటూ గతంలో చాలా సార్లు ఊహాగానాలు వచ్చాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఖండించారు. నేను ఉన్నంతకాలం సీఎంగా ఉంటానని..వేరే ఛాన్సే లేదని చెప్పారు. అయినా కొన్నాళ్ల తర్వాత మళ్లీ వచ్చే ఎన్నికల తర్వాత కేటీఆర్ సీఎం అవుతారని ప్రచారం జరిగింది. సీఎం అయ్యే అన్ని అర్హతలు ఆయనకు ఉన్నాయని మంత్రులే అన్నారు. భవిష్యత్ నాయకుడు కేటీఆరే అంటూ ప్రకటనలు చేశారు. రెండోసారీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ వార్తల్ని కొట్టిపారేశారు. ఇంకోసారి… మంత్రులు,ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నేతలకు ఆ అవకాశం కేటీఆర్ ఇవ్వదలుచుకోలేదు. ఎన్నికలకు ముందే కేసీఆరే మళ్లీ అవుతారని చెప్పేశారు. ఇక ముందు ఎవరూ ఎలాంటి ప్రకటనలు చేసే అవకాశమే లేకుండా చేశారు.
అప్పట్లో…
కేసీఆర్ తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అంటే ఒకప్పుడు సమాధానం కోసం రెండు ఆప్షన్లు వెతుక్కునేవారు. రాను రాను ఆ పరిస్థితి మారింది. ఇప్పుడు అదే క్వశ్చన్ అడిగితే కేటీఆర్ అనే సమాధానం ఠక్కున వస్తుంది. ప్రస్తుతం ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. కేసీఆర్ తర్వాత అన్నీ తానై వ్యవహరిస్తున్నారని టాక్ ఉంది.టీఆర్ఎస్ కార్యకర్తలే కాదు ప్రజలు ఇదే భావనలో ఉన్నారన్న ప్రచారం జరుగుతుంది. అందుకే ఎలాంటి పుకార్లకు ఛాన్స్ ఇవ్వొద్దు అనుకున్నారేమో కేటీఆర్…కేసీఆరే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని అనేశారు. అసలు ఊహాగానాలకే తావులేకుండా చేశారు.
అంతకు మించి…
నిజానికి వచ్చే అసెంబ్లీ ఎన్నికలు మామూలుగా ఉండవు. కేంద్రం వర్సెస్ రాష్ట్రం మధ్య హైఓల్టేజ్ వార్ ఇప్పటికే నడుస్తోంది. ఎన్నికల నాటికి అంతకుమించి ఉండబోతోంది. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారినా ఫోకస్ అంతా తెలంగాణపైనే ఉంటుంది. ముచ్చటగా మూడోసారి గెలుపు అంటే ఈసారి అంతా ఈజీకాదు. మోదీ షా వ్యూహాలు పన్నితే మమతాబెనర్జీలాంటి నేతలే వణికిపోయారు. బెంగాల్ ఎన్నికల్లో పగలే చూపించారు. అయినా దీదీ విజయవంతంగా బీజేపీ వ్యూహాల్ని తిప్పికొట్టారు. ఇక్కడ కేసీఆర్ దీదీని మించి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు.బీజేపీ ఎత్తుల్ని ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నారు. ఎమ్మెల్యేల ఎర కేసుని ఆయుధంగా వాడుకోబోతున్నారు. కేంద్రం ఐటీ,ఈడీ.సీబీఐ సోదాల పేరిట తెలంగాణలో హడావుడి చేస్తుంది. టీఆర్ఎస్ నేతల ఆర్థిక మూలాలు దెబ్బకొట్టే ప్రయత్నాలు చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండాలి.ఆయనైతే కేంద్రాన్ని బలంగా ఢీ కొడతారని గులాబీ నేతల టాక్. కేసీఆర్ కేంద్రరాజకీయాల్లో బిజీ అయితే తప్ప ఇప్పుడైతే ముఖ్యమంత్రి పీఠాన్ని వదిలే ఛాన్సే లేదు.అందుకే కేటీఆర్ అలా మాట్లాడి ఉంటారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఎవరెన్ని చెప్పినా…
ఎవరెన్ని చెప్పినా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు బంపర్ మెజార్టీ వస్తే కేటీఆర్ ముఖ్యమంత్రి అవ్వక తప్పదు. ఎందుకంటే కేసీఆర్ తర్వాత ఎవరు అనే క్వశ్చన్ వస్తుంది. కేసీఆర్ కూడా భవిష్యత్‌కు బాటలు వేయాలంటే కేటీఆర్‌ని ముఖ్యమంత్రిగా ప్రకటించాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పుడు ఉన్న టాప్ లీడర్స్ ఇద్దరిలో ఒకరిని ఇక్కడ..ఇంకొరు ఢిల్లీలో చక్రం తిప్పేలా ప్రణాళిక రచించే అవకాశం ఉంది.