ఉత్తమ్ బాధ పడొద్దు..! - MicTv.in - Telugu News
mictv telugu

ఉత్తమ్ బాధ పడొద్దు..!

July 25, 2017

తెలంగాణ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ నేతలపై ఓ రేంజ్ లో ఎక్కారు. ఢిల్లీ , గాంధీభవన్ గల్లీ లీడర్స్ పై విరుచుపడ్డారు. పాయింట్ టు పాయింట్ కార్నర్ చేస్తూ కాంగ్రెస్ నేతల్ని చెడుగుడు ఆడేశారు. లేకీ మనుషలు, సిగ్గుశరం, బుద్దిలేదని తిట్టని తిట్టు తిట్టారు. వచ్చే ఎన్నికల్లో శంకరగిరి మన్యాలు తప్పవని జోస్యం చెప్పారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. పోలీస్ వాహనాల కొనుగోలుపై జైరాం రమేష్ వ్యాఖ్యలు అర్థరహితమన్నారు.

చిల్లర మాటలు మాట్లాడుతున్నారని, తనపై దుష్ప్రచారం చేసిన జైరాం రమేష్ క్షమాపణ చెప్పాలన్నారు కేటీఆర్. దళితులపై దాడుల కేసుల్లో కాంగ్రెస్సే ఎ1 ముద్దాయి అని మండిపడ్డారు. నేరెళ్ల ఘటన పై స్పందించడం లేదని ఉత్తమ్ అంటున్నారని అని అన్నారు. కాంగ్రెస్ హయాంలో ఇసుకాసురుల పాలన నడిచిందని కేటీఆర్ విరుచుకుపడ్డారు. లూట్ , జూట్ , స్కూట్ పద్దతిలో కాంగ్రెస్ పాలన నడిచిందన్నారు.జనాలేవరు వీరిని పట్టించుకోవడం లేదని,మీడియానే పెద్దోళ్లని చేస్తుందన్నారు. ఇన్ని తిట్లు తిట్టిన కేటీఆర్…ప్రెస్ మీట్ చివరలో ..ఉత్తమ్ ..బాధపడొద్దని విజ్నప్తి చేయడం కొసమెరుపు.