అపచారం..అపచారం.. మంత్రుల్ని క్షమించు ఎల్లమ్మ తల్లీ..! - MicTv.in - Telugu News
mictv telugu

అపచారం..అపచారం.. మంత్రుల్ని క్షమించు ఎల్లమ్మ తల్లీ..!

June 28, 2017

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు భక్తి ఎక్కువ. దేవుళ్లు అంటే  ఆయనకు పరమభక్తి. ఉత్సవాలు , జాతర్లు జరిపించడానికి మస్తు పైసలు ఇస్తుంటారు.పక్కా రాష్ట్రంలో ఉన్న వెంకన్న స్వామీకి సైతం కోటి మొక్కులు చెల్లించుకున్నారు. సర్కార్ సారథికే ఇంతభక్తి ఉంటే… మంత్రులకు అంతకు మించి ఉండాలి. వీళ్ల సోయి ఎక్కడికి పోయిందో కానీ బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో అపచారం చేశారు. అమ్మ వారికి చెప్పులు వేసుకొని పట్టు వస్త్రాలు సమర్పించారు మంత్రులు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదేం నీచ సంస్కృతి అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. అమ్మ ఎల్లమ్మ తల్లీ…మంత్రులు ఏ లోకంలో ఉండి ఈ పని చేశారో క్షమించు….అంటూ పోస్టులు పెడుతున్నారు.