రాహుల్ గాంధీపై ఈడీ వేధింపులకు నిరసనగా ఛల్ రాజ్‌భవన్‌కు కాంగ్రెస్ పిలుపు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఏఐసీసీ పిలుపు మేరకు రాజ్‌భవన్ ముట్టడించేందుకు… నేతలు ప్రయత్నించగా… నిరసనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. రోడ్డుపై వాహనాలకు నిప్పు పెట్టిన కాంగ్రెస్ నేతలు… కేంద్ర సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం నేతలు ర్యాలీగా… కాంగ్రెస్ నేతలు రాజ్‌భవన్ వైపు దూసుకెళ్లారు. ఈ క్రమంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, రేణుకా చౌదరి… ఇతర నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ముఖ్యంగా మాజీ మంత్రి రేణుకా చౌదరిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా.. ఆమె తీవ్రంగా ప్రతిఘటించారు. పోలీసు కాలర్ పట్టుకుని లాగారు. అనంతరం ఆమెను పోలీసులు వాహనంలో పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మహిళా కాంగ్రెస్ నేతలపై పోలీసుల తీరు సక్రమంగా లేదని, ప్రజాస్వామ్యం కంఠం నొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని రేణుకా చౌదరి మండిపడ్డారు. తనపై చేయి వేస్తే పార్లమెంట్ వరకు ఈడ్చుకెళ్తానన్నారు. తనకు రాజ్‌భవన్ రహదారిపై వెళ్లే హక్కు ఉందన్నారు.