తెలంగాణ పోలీసు నియామక ప్రక్రియకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. టెక్నికల్ ఎస్‌ఐ, ఏఎస్‌ఐ (ఎఫ్‌పీబీ) పోస్టులకు మెయిన్స్ ఎగ్జామ్ తేదీలను టీఎస్ఎల్పీఆర్బీ ప్రకటించింది.
మార్చి 11న ఎస్‌సీడీ ఎస్ఐ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ ఆర్గనైజేషన్) అభ్యర్థులకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు.. ఏఎస్ఐ(ఎఫ్‌పీబీ) అభ్యర్థులకు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు తుది పరీక్ష జరగనుంది. హైదరాబాద్ కేంద్రంగా ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 8 నుంచి 9వ తేదీ అర్ధరాత్రి వరకు https://www.tslprb.in వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ విషయంలో సమస్యలు తలెత్తితే.. [email protected] కు మెయిల్ రూపంలో లేదా.. 9393711110, 9391005006 నంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలసుకోవచ్చని టీఎస్ ఎల్ఆర్బీ ప్రకటించింది. మిగిలిన రెండు పరీక్షలకు సంబంధించిన తేదీలు త్వరలో విడుదల కానున్నాయి.