Home > Featured > రేపే టీఎస్ పాలిసెట్ ఫ‌లితాలు.. రిజల్ట్స్ లింక్ ఇదే

రేపే టీఎస్ పాలిసెట్ ఫ‌లితాలు.. రిజల్ట్స్ లింక్ ఇదే

టీఎస్ పాలిసెట్ -2022 ఫ‌లితాలు బుధ‌వారం ఉద‌యం 11:30 గంట‌ల‌కు విడుద‌ల కానున్నాయి. నాంప‌ల్లిలోని టెక్నిక‌ల్ ఎడ్యుకేష‌న్ క‌మిష‌న‌ర్ కార్యాల‌యంలోని ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ కాన్ఫ‌రెన్స్ హాల్‌లో ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు కన్వీనర్‌ సి.శ్రీనాథ్‌ తెలిపారు. గత నెల 30న 365 కేంద్రాల్లో నిర్వహించిన పాలిసెట్‌ పరీక్షకు 1,4,432 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఆ విద్యార్థులు https://polycetts.nic.in/ వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు.

10వ తరగతి తర్వాత పాలిటెక్నిక్‌ కాలేజీల్లో డిప్లొమో కోర్సుల్లో ప్రవేశానికి ఈ పాలిటెక్నిక్‌ కామన్ ఎంట్ర‌న్స్ ను నిర్వ‌హిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో వ‌చ్చిన ర్యాంక్‌ ఆధారంగా ఇంజనీరింగ్, అగ్రికల్చర్, హార్టికల్చర్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు.

Updated : 12 July 2022 9:46 AM GMT
Tags:    
Next Story
Share it
Top