విద్యార్థులకు టీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్ - MicTv.in - Telugu News
mictv telugu

విద్యార్థులకు టీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్

May 23, 2022

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పదవ తరగతి విద్యార్థిని, విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పదోవ తరగతి పరీక్షలు మొదలైన విషయం తెలిసిందే. విద్యార్థుల పరీక్షలను దృష్టిలో ఉంచుకొని టీఎస్ ఆర్టీసీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు పరీక్షల విషయంలో ఎలాంటి అవస్థలు పడకుండా ఉండేందుకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేలా అవకాశాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే విద్యార్థులను వారి వారి ఎగ్జామ్ సెంటర్ల వద్దకు ఆర్టీసీ బస్సులు తీసుకెళ్లాయి. మళ్లీ పరీక్ష ముగిసిన వెంటనే బస్సులు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కోరారు.

ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి నేటీ వరకు వినూత్న కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నారు. ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకు రావడానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రయాణికుల విషయంలో ఎప్పటికప్పుడు సరికొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. టెన్త్ విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేలా, ప్రయాణం విషయంలో అవస్థలు పడకుండా ఉచితంగా బస్సులను ఏర్పాటు చేశారు.