TS RTC good news.. free medical for under 75 years
mictv telugu

టీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్..వారికి ఉచిత వైద్యం

August 12, 2022

తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన 75 ఏళ్ల వృద్దులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్తను చెప్పింది. హైదరాబాద్‌లోని తార్నాకలో ఉన్న టీఎస్ ఆర్టీసీ ఆసుపత్రిలో స్వాతంత్ర్య వజ్రోత్సవాలను పురస్కరించుకొని 75 ఏళ్లు నిండిన వృద్ధులకు ఈనెల 15-20 వరకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. శైలజా మూర్తి గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. కావున ఈ అవకాశాన్ని రాష్ట్రంలోని వృద్దులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

”మందులను ఉచితంగా అందజేస్తాం. 75 ఏళ్ల లోపు వారికి 75 శాతం రాయితీ ఇస్తున్నాం.. ఈ సేవలను అందరూ వినియోగించుకోండి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉచితంగా సంప్రదింపులు, ప్రధానమైన ఆరోగ్య పరీక్షలు, ఉచితంగా మందులు అందజేస్తాం. 75 ఏళ్ల లోపువారికి మాస్టర్ హెల్త్ చెకప్ కేవలం రూ. 750కే చేస్తాం. వైద్యులు రాసిన మందులపై 75 శాతం రాయితీ ఇస్తాం. వైద్యం చేయించుకున్నవారు ఇంటికి చేరుకోడానికి 2 గంటల వరకు ఉచిత బస్సు ప్రయాణం కల్సి స్తున్నాం. త్వరలోనే వైద్య సేవలన్నీ సెల్ ఫోను ద్వారా తెలుసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నాం” అని ఆమె తెలిపారు.

మరోపక్క టీఎస్ ఆర్టీసీ రాష్ట్రంలో ఏ పండగవచ్చిన, జాతరలు జరిగిన ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని, ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్య ఫాదర్స్ డే రోజునా, మదర్స్ డే రోజునా, పంద్రాగస్ట్ రోజున కూడా ఉచితంగా బస్సు సేవలను అందిస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఈ క్రమంలో మరోసారి టీఎస్ ఆర్టీసీ ఆగస్ట్ 15ను పురస్కరించుకొని 75 ఏళ్లలోపు వారికి ఉచితంగా వైద్యం చేస్తున్నామని ప్రకటించింది.