తెలంగాణ రాష్ట్రంలోని టీఎస్ ఆర్టీసీ మరో ముందడుగు వేసింది. ఒకేసారి 300 ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్డర్ ఇచ్చింది. రూ.500 కోట్ల విలువైన ఈ 300 ఎలక్ట్రిక్ బస్సులను ఒలెక్జా గ్రీన్టెక్ లిమిటెడ్ అనే సంస్థ సరఫరా చేయనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.
ఈ 300 ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన ఓ ప్రకటనను శుక్రవారం అధికారులు విడుదల చేశారు. ఈ ప్రకనటలో..”ది మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) గ్రూప్ కంపెనీ అయిన ఎవీట్రైన్స్ ప్రైవేటు లిమిటెడ్ (ఈవీఈవై)నకు టీఎస్ఆర్టీసీ లెటర్ ఆఫ్ అవార్డు (ఎల్వోఏ) ఇచ్చింది. ఈవీఈవై కంపెనీ ఈ ఎలక్ట్రిక్ బస్సులను ఒలెక్ట్రా నుంచి సమకూర్చుకుంది. ఒలెక్ట్రా మొత్తం 20 నెలల్లో 300 బస్సులను సమకూర్చి, 12 ఏండ్ల వరకు బస్సుల నిర్వహణను చూస్తుంది. ఈ బస్సులో అమర్చిన లిథియం-అయాన్ బ్యాటరీని ఒకసారి చార్జ్ చేస్తే ట్రాఫిక్, ప్రయాణికుల లోడ్ పరిస్థితులను బట్టి 200 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు” అని అధికారులు పేర్కొన్నారు.
అనంతరం ఒలెక్జా గ్రీన్టెక్ చైర్మన్ కేవీ ప్రదీప్ మాట్లా డుతూ.. ”ఒలెక్ట్రా గ్రీన్టెకు మరో ప్రతిష్టాత్మక ఆర్డర్ రావటం సంతోషంగా ఉంది. ‘తెలంగాణ పౌరులకు అత్యాధునిక, కాలుష్యం వెదజల్లని ఎలక్ట్రిక్ బస్సులతో సేవ చేయడం గౌరవంగా భావిస్తున్నాం. ఒలెక్ట్రా ఇప్పటికే హైదరాబాద్లో మూడేండ్లుగా సేవలు అందిస్తుంది. ఈ బస్సులను సకాలంలో డెలివరీ చేసి పౌరులకు అత్యుత్తమ ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తాం’ అని ఆయన అన్నారు.