Ts School Academic Calendar 2022 To 2023 Released
mictv telugu

అకాడమిక్ క్యాలెండర్ విడుదల.. ఈ ఏడాదిలో ఎన్ని సెలవులంటే..

June 29, 2022

Ts School Academic Calendar 2022 To 2023 Released

తెలంగాణ విద్యాశాఖ పాఠశాల అకాడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు జూన్ 13న పునఃప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి అకాడమిక్ క్యాలెండర్ (2022-23) విడుదలైంది. ఈ విద్యాసంవత్సరం 230 పని దినాలు ఉండనున్నాయి. ఈ అకాడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం ఈ విద్యా సంవత్సరం 4 ఏప్రిల్‌ 2023న ముగియనుంది.

అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. ప్రైమరీ స్కూళ్ల టైమింగ్ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు, ప్రాథమికోన్నత పాఠశాలలు ఉదయం 9గం. నుండి సాయంత్రం 4:15 గం. వరకు, హైస్కూళ్లు ఉదయం 9గం. నుండి సాయంత్రం 4:45 గం. వరకు పనిచేయాలని తెలిపింది. దసరా సెలవులు సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 9 వరకు(14 రోజులు) , సంక్రాంతి సెలవులు జనవరి 13 నుండి జనవరి 17 వరకు(5 రోజులు) పాఠశాలలకు సెలవులుగా నిర్ణయించారు.
ఇక వచ్చే ఏడాది మార్చిలో పదవ తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. 25 ఏప్రిల్ 2023 నుంచి 11 జూన్ 2023 వరకు వేసవి సెలవులు ఉండనున్నాయి. పదవ తరగతికి సంబంధించిన అన్ని సబ్జెక్టుల సిలబస్ 10 జనవరి 2023 వరకు పూర్తి కావాలని అకాడమిక్ క్యాలెండర్ ద్వారా ప్రకటించారు. ఎస్సెస్సీ బోర్డ్ ఎగ్జామినేషన్ ప్రారంభించే ముందు రివిజన్ క్లాసులు, ప్రీ-ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు.